చిన్న చింతకుంటలో నల్లమట్టి అక్రమ దందా

-3 జేసీబీలతో దర్జాగా దోపిడీ
-చోద్యం చూస్తున్న రెవిన్యూ, పోలీస్,మైనింగ్ అధికారులు
-అనుమతి ఇవ్వలేదు: తహసీల్దార్ సువర్ణరాజు
-అక్రమ రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
-సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్

పట్టపగలు….ఎలాంటి అనుమతులు లేకుండానే…జేసీబీలతో…. దర్జాగా….. నల్లమట్టి అక్రమంగా తరలిస్తున్న పట్టించుకొనే నాథుడే కరువయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువులోని నల్లమట్టిని జిల్లా సరిహద్దులు దాటి అక్రమంగా తరలిస్తున్న వైనం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని దమగ్నపూర్ గ్రామ శివారు చెరువు నుండి శుక్రవారం ఉదయం 7 గంటల నుండి దాదాపు 28 ట్రాక్టర్ లతో నల్లమట్టిని ఎలాంటి అనుమతులు
mhb2 తీసుకోకుండా జిల్లా సరిహద్దులు దాటించి, నారాయణపేట జిల్లా నర్వా మండలంలోని కోమరలింగపల్లికి తరలించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు 300 ట్రిప్పుల నల్లమట్టి అక్రమంగా తరలిస్తున్న సంబంధిత రెవిన్యూ, పోలీస్, మైనింగ్, అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా, తాపీగా చోద్యం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలాఉంటె శుక్రవారం మధ్యాహ్నం ఈ నల్లమట్టి అక్రమ రవాణా విషయమై చిన్న చింతకుంట తహసిల్దార్ సువర్ణరాజు ను వివరణ కోరగా, తాను ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తహసిల్దార్ తెలుపడం గమనార్హం.

అనుమతి ఇవ్వలేదు: తహసీల్దార్ సువర్ణరాజు
చిన్న చింత కుంట మండలంలోని దమగ్నపూర్ చెరువు నుండి నల్లమట్టి రవాణా చేస్తూన్నారని చిన్న చింతకుంట తహసిల్దార్ సువర్ణరాజుకి సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ పిర్యాదు చేయగా, దమగ్నపూర్ గ్రామ శివారు చెరువు నుండి నల్లమట్టి రవాణాకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. అధికారులు అనుమతులు ఇవ్వకపోయినా….3 జేసీబీలతో యథేచ్ఛగా నల్లమట్టిని అక్రమంగా తొడుతూ….ట్రాక్టర్లతో…. బాజాప్త అక్రమంగా నల్లమట్టిని రవాణా చేయడం చూస్తే సంబంధిత అధికారుల…. నిఘా ఏమాత్రం ఉందో స్పష్టం అవుతోంది.

అక్రమ రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని దమగ్నపూర్ గ్రామ శివారు చెరువు నుండి నల్లమట్టి అక్రమ రవాణా కొనసాగుతున్న….అడ్డుకోవాల్సిన మైనింగ్, రెవిన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా, తాపీగా చోద్యం చూస్తున్నారని,సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ నేపద్యంలో శుక్రవారం ఉదయం నుండి దమగ్నపూర్ గ్రామ శివారు చెరువు నుండి నల్లమట్టిని అక్రమంగా 28 ట్రాకర్లలతో దాదాపు 300 ట్రిప్పుల నల్లమట్టిని తరలించిన…. సంబంధిత రెవిన్యూ, పోలీస్ అధికారులతో పాటు మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

నల్లమట్టి అక్రమ రవాణాకు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో అటువైపు రెవిన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు వెళ్లేందుకు జంకుతున్నారన్నారు.నల్లమట్టిని అక్రమ రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే నల్లమట్టి రవాణాకు తమతో కానీ, మైనింగ్ అధికారులతో కానీ అనుమతలు తీసునుకుంటే సరిపోయేదని, నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకొని, ప్రభుత్వానికి రాయలిటీ కడితే అనుమతులు ఇచ్చేవారమన్నారు.

ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నల్లమట్టిని జిల్లా సరిహద్దులు దాటించి, నారాయణపేట జిల్లా నర్వా మండలంలోని కోమరలింగపల్లికి తరిస్తున్న సంబందిత మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట జిల్లా రెవిన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోక పోవడం గమనార్హం. ఇకనైనా నల్లమట్టిని అక్రమ రవాణా చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త, …” నేనుసైతం” స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
mhb

Leave a Reply