Suryaa.co.in

Andhra Pradesh

బొక్కల జీన్స్ ప్యాంటులో – గుడివాడలో ప్రత్యక్షం

(బాబు భూమా)

ఏడాది కాలంగా గుడివాడకు దూరంగా ఉన్న కొడాలి నాని, ఇప్పుడు బుల్లెట్‌పై సెలబ్రిటీ యాంకర్లను తిప్పే హంగామా లేకుండా, స్కూలు పిలకాయ లెక్కన చేతులు కట్టుకొని ఇలా, దిగువ కోర్టులో బెయిల్ కోసం స్వయంగా హాజరయ్యారు. రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బెయిల్ కోసం ఇక్కడి కోర్టుకు రావడం చర్చనీయాంశంగా మారింది.

ఈ కేసులో ఇప్పటికే 16 మంది నాని అనుచరులు బెయిల్‌పై విడుదల కాగా, వారిలో కొందరు కొడాలి నాని చెప్పడంతోనే దాడి చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించడం ఆయనకు మరింత చిక్కులు తెచ్చిపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కొడాలి నానిపై ఆయన గతంలో చేసిన అరాచకాలకు సంబంధించిన పలు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా వంద కోట్ల స్కామ్ కేసు ఆయన మెడకు చుట్టుకుంది.

అరెస్టవుతాననే భయంతో తన బూతుల నోరును నొక్కేసుకొన్న నాని, హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఆ మధ్య మైకు ముందు పెట్టి మాట్లాడమన్నా నోరు తెరవలేదు. అరెస్ట్ భయంతోనే హైదరాబాద్‌లో హెల్త్ చెకప్‌లు చేయించుకుని, ఆ తర్వాత ముంబైలో హార్ట్ సర్జరీ చేయించుకున్నారనే వార్తలు కూడా అప్పట్లో చక్కర్లు కొట్టాయి. చివరికి, ఇలా బెయిల్ కోసం గుడివాడలో ప్రత్యక్షమయ్యారు, బొక్కల జీన్స్ ప్యాంటులో.

LEAVE A RESPONSE