Suryaa.co.in

Andhra Pradesh Telangana

పువ్వాడ అనవసర విమర్శలు మానుకోవాలి

పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని.. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడటాన్ని తప్పుపట్టారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. పువ్వాడ అజయ్‌ అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన గ్రామాల ప్రజల కోసం ఏమి చేయాలో తమకు తెలుసునని స్పష్టం చేశారు. ‘ఆయా గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే ఏపీని కూడా కలపాలని అడుగుతాం. ఏపీ ఆదాయం తగ్గింది ఇప్పుడు హైదరాబాద్‌లో కలిపేస్తారా?’ అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

LEAVE A RESPONSE