గురుపూజోత్సవాన్ని గురువులు బహిష్కరించడం జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు నిదర్శనం

– ప్రభుత్వానికి ఉత్తమ టీచర్లు ఎలా కావాలో, అలానే వాళ్లు కూడా ఉత్తమ ప్రభుత్వం కావాలి
– శాసన మండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు

డా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని దేశమంతటా జరుపుకుంటాం. నేడు మన రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలు టీచర్స్ డే ని బహిష్కరిస్తున్నామని చెప్పడం బాధాకరం. గురుబ్రహ్మ అని గురువులని పూజించాలి. ప్రాణం రక్షించే వైద్యుడిని, జ్ఙానాన్ని, విజ్ఞానాన్ని ఇచ్చేది గురవులను ఎంతో గౌరవిస్తాం. ఉత్తమ ఉపాధ్యాయులని సంస్కరించే టీచర్సడే ని టీచర్స్ యూనియన్ బహిష్కరించడం జగన్ రెడ్డి ప్రభుత్వ పాలనా తీరు ఏ విధంగా ఉందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి.

గురువులు ఒక్కరే కాదు జగన్ రెడ్డి పాలనలో ఎవరూ సంతోషంగా లేరు మరీ ముఖ్యంగా ఉద్యోగస్థులు. టీచర్ల మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటు. ప్రపంచంలో టీచర్లకున్న గౌరవంలో కొద్ది శాతం కూడ ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. గతంలో బతకలేక బడి పంతులు అంటే నేడు బడి పంతులుగా బతకడం కష్టంగా ఉంది. ఉపాధ్యాయ వృత్తి విద్యాబుద్దులు చెప్పడం. దాన్ని ప్రభుత్వం పక్కన పెట్టించి బ్రాంది షాపుల దగ్గర పెట్టడం, బాత్రూం లని ఫోటోలని తీయడం, మిడ్డే మీల్ లో ఫోటొలని తీయడం, యాప్ లలో సమాచారం ఇవ్వండి అంటూ ఇలాంటి పనులు చేయిస్తూ ఉపాధ్యాయ వృత్తిని అవమానపరుస్తున్నారు.

టీచర్ల ఖాళీలను భర్తీ చేయాలని, పాఠశాలలో సౌకర్యాలని కల్పంచాలని కోరినందుకు నాడు-నేడు పేరుతో ప్రధానోపాధ్యాయుడికి బాధ్యతలు ఇచ్చి ఒత్తిడి పెంచారు. కరోనా సమయంలోను పని చేయించి మనో వేధనకు గురి చేశారు. కరోనా సమయంలో నాడు- నేడులో పనుల సమీక్షలో చనిపోయిన వారు వందల మంది ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.

టీడీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూల్స్ పధకాన్ని ఎత్తేస్తే ప్రభుత్వంలో విలీనం చేసి జీతాలిచ్చింది. జగన్ ప్రభుత్వానికి అది భారం కాబట్టి ఎస్.జి.టి ని రద్దు చేసి 10వేల పైనే పోస్టులు ఖాళీ పెట్టింది. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తానని హామీనిచ్చిన జగన్ రెడ్డి మూడేళ్లైనా ఒక్క డిఎస్సీ కూడా పెట్టలేదు. గతంలో రెండు డిఎస్సీలు నిర్వహించిన ఘనత టీడీపీది.

నూతన విద్యా విధానం పేరుతో పాఠశాలలను విలీనం చేసింది. గతంలో ఉన్న ప్రాధమిక, ఉన్నత విద్యా విధానాన్ని ప్రీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్యూల్ గా మార్చడంతో దాదాపు 16వేల మంది టీచర్లు అదనమని ప్రభుత్వం తేల్చింది. 3వేల మందిని కొత్తగా పెడుతన్న జూనియర్ కాలేజీలలో నియమిస్తాం, మిగతా 13వేల మంది అదనం కాబట్టి కొత్త నియామకాలు చేయమని ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది. ట్రాన్సఫర్లలో జరిగిన అన్యాయాన్ని ఎలిగెత్తి మాట్లాడరని కక్షపూరితంగా ఎన్నో చోట్ల అనేక రకాలైన పనిష్మెంట్లు ఇస్తున్నారు. టీచర్లు, ఉద్యోగస్థులు సిపియస్ మీద ఉద్యమం చేశారని బయోమెట్రిక్ విధానం తీసేసి ఫేస్ రికగ్నేషన్ అటెండన్స్ పెట్టారు. ఫేస్ రికగ్నేషన్ కి నెట్ వర్క్ కావాలి. అందుకు మీ ఫోన్లనే డేటాని వాడి అప్ లోడ్ చేయాలనడం దుర్మార్గం.

ఆశా వర్కర్లకి, అంగన్ వాడీ వాళ్లకు తక్కువ జీతం కాబట్టి టాబ్ లను ఇచ్చామంటున్నారు. మీకు ఎక్కువ జీతం కాబట్టి మీ ఫోన్ లలోనే అటెండెన్స్ ను ఇవ్వండని ప్రభుత్వం వింత వాదనను తీసుకురావడం సిగ్గుచేటు. సిపియస్ ఉద్యమం చేశారని అనేక మంది పై బైడోవర్ కేసులు, బాండ్లు వంటివి పెట్టారు. అదే విధంగా సెప్టెంబర్ 1న చేయాల్సిన ఉద్యమాన్ని జగన్ రెడ్డి అణగతొక్కారు. ప్రభుత్వానికి ఉత్తమ టీచర్లు ఎలా కావాలో, అలానే వాళ్లు కూడా ఉత్తమ ప్రభుత్వం కావాలని కోరువడం తప్పా. ఉత్తమ టీచర్లు కావాలంటే దానికి తగ్గ వాతావారణాన్ని కల్పించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది.. విద్యార్ధులకు తగిన విధంగా తరగతి గదులు, సిలబస్, సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నా ప్రభుత్వం చలనం లేదు.

గత విద్యాశాఖ మంత్రి టీచర్ల సంఘాల సమస్యలు చెప్పినా వినే వారు కాదు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఏం చెబుతున్నారో ఎవరికి అర్ధం కావడం లేదు. ఫేస్ రికగ్నేషన్ యాప్ టీచర్లకి మాత్రమే కాదు మొత్తం ఉద్యోగస్థులందరికి పెడతాం అని మంత్రి చెప్పారు. దానికి ఆరోగ్యశాఖ కార్యదర్శి స్పందించి ఫేస్ రికగ్నేషన్ ని వైద్యశాకలో పెట్టడం లేదు. ఉన్న బయోమెట్రిక్ నే కొనసాగిస్తామన్నారు.

కక్ష సాధింపు చర్యగా ఫేస్ రికగ్నేషన్ యాప్ ని టీచర్లకు మాత్రమే పెట్టారు. దానికి 15 రోజులు శిక్షణ ఇస్తామనడం దుర్భరం. ప్రభుత్వం ఏదైనా కొత్త విధానాన్ని అమలు చేయాలనుకుంటే ముందు ఒక జిల్లాలో, ప్రాంతంలో ట్రైల్ చేసి బాగుంటే రాష్ట్రమంతా అమలు చేస్తారు. కాని ఇక్కడ జగన్ రెడ్డి మాత్రం రాష్ట్రమంతా యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలని బలవంతంగా రుద్ది కక్ష సాధిస్తున్నారు. గురువు విలువ ముఖ్యమంత్రికి తెలుసా?

అక్రమాలలో అండగా నిలిచేవారే జగన్ రెడ్డికి అష్టదుష్ట గురువులు. 1. మైనింగ్ మాఫియా గాలి జనార్ధన్ రెడ్డి, 2. ఎర్రచందనం, సాండ్ మాఫియా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, 3. లిక్కర్, ల్యాండ్ మాఫియా, దొంగ లెక్కలు విజయసాయి రెడ్డి, 4. జేట్యాక్స్ వసూల్ వై.యస్. భారతి రెడ్డి, 5. భూ మాఫియా, అరాచకాలు జగన్ రెడ్డి మేనమామ రవీంద్రా రెడ్డి, 6. సెటిల్మెంట్ సలహాలు సజ్జల రామకృష్ణ రెడ్డి, 6. అబద్ధాల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, 7. బూతుల కొడాలి నాని, 8. దాడులు, దౌర్జన్యాల పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వీల్లంతా జగన్ రెడ్డికి గురువులు. వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గురుపూజోత్సవ దినంగా సన్మానించి ఉంటే బాగుండేది.

200 మంది టీచర్లని పిలిచి తూతూమంత్రంగా సన్మానం చేసి బలవంతంగా శాలవాలు కప్పుతున్నారు. దాదాపు 2లక్షల మంది ఉన్నా ఉపాధ్యాయ సంఘాలలో 95శాతం ఆ కార్యక్రమం వద్దని బహిష్కరించారు. విద్యావిధానాన్ని జగన్ రెడ్డి పూర్తిగా అటకెక్కించారు. రేషనలైజేషన్ పేరుతో కిలో మీటరుకు స్కూల్ ఉండాలి అనే విధానాన్ని తీసేశారు. ఒక్కో స్కూల్ ని మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో పెట్టారు. చిన్న పిల్లలు పాఠశాలలకుఎలా వెళ్తారని ప్రశ్నార్థకంగా మారింది? అందుకే దగ్గరలోని ప్రైవేటు స్కూళ్లల్లో పిల్లలని చేర్పిస్తున్నారు.

అందువల్ల ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గింది. పిల్లల సంఖ్య తక్కువ ఉన్నందున స్కూళ్లని మూసేస్తున్నామన్నారు. 10వ తరగతి ఫలితాలు ఎన్నడూ లేని విధంగా వచ్చాయి. దానికి సంబంధించి వేసిన కమిటీ సరిపడా టీచర్లు లేరని అభిప్రాయం వ్యక్తం చేసింది. కాని ప్రభుత్వం టీచర్ల పాఠాలు చెప్పడం లేదని చెబుతుంది. ఒక టీచర్ ఎంత మందికి పాఠాలు చెబుతారు, ఎంత సమయం చెబుతారు, ఎన్ని సబ్జెక్ట్ లు చెబుతారనే లెక్కలు ప్రభుత్వం దగ్గర లేకపోవడం సిగ్గుచేటు.

137 మంది పిల్లలు ఉన్న హైస్కూల్ లో ప్రధానోపాధ్యాయుడు, పిఈటి లేరు. ప్రైమరీ స్కూల్ లో ఇంత కన్నా తక్కువ ఉంటే ఆ స్కూల్ లో కూడ ఇదే పరిస్ధితి పునారావృతం అవుతుంది.

ప్రభుత్వం ఎన్నో కోట్లు వృధా ఖర్చు పెడుతుంది కాని ఒక పిఇటిని కూడ పెట్టలేని విధంగా విద్యా విధానాన్ని తీసుకొస్తే బావి తరాల భవిష్యత్తు ఏంటి? నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ ప్రకారం 6వ తరగతి వరకు మాతృభాషలో విద్యా విధానం ఉండాలని చెప్పింది. 1 నుంచి 8 తరగతి వరకు ఇంగ్లీష్, 9 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్, తెలుగు విద్యా విధానంలో ఉండాలని తెచ్చారు. పిల్లల పరిస్థితి, బోధించే టీచర్ల పరిస్ధితి తెలుసుకోకుండా బలవంతంగా ఇంగ్లీషుని రుద్దుతున్నారు.

ఆంగ్లం వస్తేనే మేధావులా? ఆంగ్లం వస్తేనే ఉద్యోగం వస్తుందా? ఇద్దరు కలిస్తే ఎక్కడైనా మాతృబాషలో మాట్లాడుకుంటారు, కాని మన దౌర్భాగ్యం మన మాతృబాష వదిలేసి ఆంగ్లంలా మాట్లాడుకుంటారు. గురువులు వాళ్ల వృత్తిని పూర్తిగా కొనసాగించే విధంగా చేయాలి. వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా వాళ్ల చట్టాలలో సర్వీస్ కండీషన్స్ ని ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

Leave a Reply