Suryaa.co.in

Telangana

హెచ్‌సియు భూములపై అటవీ శాఖకు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ లో భాగమైన కంచ గచ్చిబౌలిలోని భూములలో పర్యావరణ వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చేసిన కోలుకోలేని నష్టం – అటవీ సంరక్షణ చట్టం 1980 మరియు వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 ఉల్లంఘన – నివారణ మరియు బాద్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్పా ర్టీ సీనియర్ నాయకులు డా.RS ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో తెలంగాణ అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వైల్డ్‌లైఫ్ చీఫ్ వార్డెన్ మెరూ‌కు అరణ్య భవన్‌లో పిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్పార్టీ రాష్ట్ర నాయకులు డా.చిరుమళ్ల రాకేష్,డా.కురువ విజయ్ కుమార్,కిషోర్ గౌడ్,మన్నె గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE