-కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మేరకే బిడ్డింగ్
-ఎక్కువ కోట్ చేసిన వారికే లీజు దక్కింది
-మేము సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నాం
-కిషన్ రెడ్డి సీబీఐ విచారణ కు సిద్ధం కావాలి
-కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు
-కిషన్ రెడ్డి సీబీఐ విచారణ కు సిద్ధం కావాలి
-అదానీ పై జేపీసీ వేయని వారు సీబీఐ కి డిమాండ్ చేస్తున్నారు
-కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసి ఇక్కడ మాట్లాడాలి
-ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కె. పి. వివేకానంద
అవుటర్ రింగ్ రోడ్ టెండర్లపై కాంగ్రెస్-బీజేపీ చేస్తున్న ఆరోపణలు గాలిమాటలనేనని బీఆర్‌ఎస్ తిప్పికొట్టింది. గతంలో కేంద్రం రూపొందించిన నిబంధనల ప్రకారమే బిడ్డింగ్ జరిగిందని, అందులో ఎక్కువ కోట్ చే సిన వారికే టెండరు దక్కిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కె. పి. వివేకానంద స్పష్టం చేశారు. తాము సీబీఐకి సిద్ధంగా ఉన్నామని, కిషన్‌రెడ్డి విచారణకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఏమన్నారంటే..
నెహ్రూ ఔటర్ రింగు రోడ్డు లీజు కు సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణల్లో నిజం లేదు.గతం లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మేరకే బిడ్డింగ్ జరిగింది.నాలుగు ప్రముఖ సంస్థలు షార్ట్ లిస్ట్ అయ్యాయి.అందులో ఎక్కువ కోట్ చేసిన వారికే లీజు దక్కింది .
కిషన్ రెడ్డి డిమాండ్ చేసినట్టు మేము సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నాం.కిషన్ రెడ్డి సీబీఐ విచారణ కు సిద్ధం కావాలి.ఆదానీ పై జేపీసీ వేయని వారు సీబీఐ కి డిమాండ్ చేస్తున్నారు. పూణే లో ఇక్కడ లీజు తీసుకున్న వారే తీసుకున్నారు. బీజేపీ ఆరోపణల్లో పసలేదు. రవ్వంత రెడ్డి తొండి సంజయ్ లు పిచ్చి విమర్శలు మానాలి.ఇప్పటికైనా ప్రజలకు పనికొచ్చే విషయాల పై మాట్లాడాలి.
ఎమ్మెల్యే కె. పి. వివేకానంద ఏమన్నారంటే..
మంత్రి కే టీ రామారావు చొరవతో హైద్రాబాద్ కు అంతర్జాతీయ ఖ్యాతి దక్కడాన్ని రెండు జాతీయ పార్టీలు ఆయన టార్గెట్ గా విమర్శలు చేస్తున్నాయి. పెద్దోళ్లను తిడితే పేపర్లలో పతాక శీర్షిక ల్లో వస్తామని చవక బారు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏదీ జరిగినా దానికి ktr కారణం అన్నట్టుగా కాంగ్రెస్ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. పేపర్ లీకేజీ, orr వ్యవహారాల్లో ప్రతిపక్షాల తీరు అభాసు పాలయ్యే విధంగా ఉంది. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ లో ఎలాంటి కొత్త దనం లేదు. ఇప్పటికే విడుదల అయిన రైతుల డిక్లరేషన్ ను ప్రజలు మరచిపోయారు. కర్నాటక లో బీజేపీ చావుదెబ్బతినబోతోంది. సిద్ధ రామయ్య లాంటి నేతలను చూసి అక్కడ కాంగ్రెస్ కు ఓట్లు వేస్తున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ కు అలాంటి నేతలు లేరు.తెలంగాణ లో ఎలాగూ అధికారం లోకి రాలేమని కాంగ్రెస్ నేతలు పనికి రాని అంశాలపై మాట్లాడుతున్నారు.
ప్రియాంక తెలంగాణ ఇచ్చామని ఇపుడు చెబుతూ ఓట్లు అడుగుతున్నారు. 2014 2018 లలో కేసీఆర్ ను ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ ను తిరస్కరించారు.వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆర్ కే ప్రజలు పట్టం కడుతారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసి ఇక్కడ మాట్లాడాలి.