– రేవంత్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: కాలు గడప దాటదు కానీ .. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి.నీళ్లు లేక పంటలు ఎండి- పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే .. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్.
39 సార్లు ఢిల్లీ పోయి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప, .. ఢిల్లీ నుండి సాధించిన పని .. తెచ్చిన రూపాయి లేదు.రాహుల్ గాంధీతో నీ సంబంధాల గురించి తెలంగాణకు ఏం అవసరం? మీ మధ్య సంబంధం ఉంటే మాకేంటి-ఊడితే మాకేంటి?తెలంగాణకు ఒరిగేది ఏంటి?
గ్రామ గ్రామాన, గల్లీ గల్లీల్లో మీకు ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే-చీమకుట్టినట్టు కూడా లేని నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్. మొహం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు .. ఆడ లేక పాతగజ్జెలు అన్నట్లు హామీల అమలు చేతగాక గాలి మాటలు .. గబ్బు కూతలు.