అమరావతి: టెలికాం రంగంలో సంచలనంగా మారటమే కాదు.. అనూహ్య రీతిలో స్వల్ప వ్యవధిలో దూసుకెళ్లిన రిలయన్స్ జియోకు తాజాగా గట్టి షాక్ తగిలింది. అది కూడా జనం చేతిలోనే. ఏ ప్రజలైతే జియో కనెక్షన్ కోసం వెర్రెత్తిపోవటమే కాదు.. సిమ్ కోసం గంటల తరబడి క్యూలో నిలుచొని మరీ సొంతం చేసు కున్నారో.. అదే జియోకు దిమ్మ తిరిగే షాక్ తగిలిన వైనం తాజాగా బయట కు వచ్చింది.
గత ఏడాది డిసెంబరులో పెద్ద ఎత్తున మొబైల్ యూజర్లు జియోను వదిలి వెళ్లిపోయారు. ఎందుకిలా? అంటే.. అనూహ్యంగా పెంచిన ధరలే కారణమని చెబుతున్నారు. అప్పటి వరకు ఉన్న ధరలకు 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవటంతో.. తక్కువ ధరలున్న నెట్ వర్కుకు చేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ ఎన్ఎల్ భారీగా లాభప డింది. వాస్త వానికి కేంద్రం లోని మోడీ సర్కారు బీఎస్ఎన్ఎలను వదిలించు కోవాల న్న ఉద్దేశంతో ఉండటం తెలిసిందే.
నెట్ వర్క్ కి పెద్ద ఎత్తున మొబైల్ యూజర్లు చేరారు. తాజాగా విడుద లైన ట్రాయ్ లెక్కల్ని చూస్తే.. నవంబరుతో పోలిస్తే డిసెంబరు 2021లో దేశ వ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు ఇలాంటి వేళ.. ఈ సంస్థకు చెందిన వినియోగదారుల సంఖ్య 1.28 కోట్లు తగ్గిందని పేర్కొంది. రిలయన్స్ జియో నుంచి దాదాపు 1.29 కోట్ల మంది మొబైల్ యూజర్లు తమ కనెక్షన్లు వదులుకున్నారు.