– వెయ్యి మందికి నిత్యావసరాలు
– సేవలను ప్రశంసించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రామయ్య
విజయవాడ: బీఎస్‌ఎస్ మైక్రో ఫైనాన్స్ కార్పొరేషన్, రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి సేవలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అభినందించారు. విజయవాడలోని ఎన్జీఓ హోంలో 1000 మంది వరద బాధితులకు వారందించిన నిత్యావసర సరుకులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రామయ్య మాట్లాడారు. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షణీయమన్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే చంద్రబాబు పిలుపునకు స్పందించి తమ వంతుగా సహాయం అందించడం అభినందనీయమని కొనియాడారు.
కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెద్ద పరిశ్రమలు మందుకు వచ్చి బాధితులకు అండగా నిలబడాలని కోరారు. హఠాత్తుగా వచ్చిన వరదల దాటికి ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయని.. వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని .. రాష్ట్రంలో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఉండటం వలనే బుడమేరు ఎంత ధీటుగా పొంగిందో.. అంతే ధీటుగా బాధితులను చంద్రబాబు ప్రభుత్వం ఆదుకుందన్నారు.