– ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు
– నిర్మాణంలో ఉండగ నే కూలిన వైనం
– నాసిరకం నిర్మాణమే కారణమా?
హైదరాబాద్: హైదరాబాద్ యూనివర్సిటీ (HCU) లో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎక్స్టెన్షన్ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, నిర్మాణంలో ఉన్న స్తంభాలు మరియు కాంక్రీట్ స్లాబ్‌లు కూలిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదానికి కారణాలను తెలుసుకోవడానికి యూనివర్సిటీ అధికారులు మరియు స్థానిక పోలీస్ శాఖ సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు. నిర్మాణ నిబంధనలు పాటించడంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు.
కాగా నాసిరకం నిర్మాణం వల్లనే యూనివర్శిటీలో బిల్డింగ్ ఎక్స్టెన్షన్ కూలిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది.