రాజధాని అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు

-ప్రభుత్వం కుయుక్తులు పన్ని ఎన్ని అడ్డంకులు సృష్టించినా -అమరావతి రైతులు భరిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారు
-అమరావతి రైతుల త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది
-న్యాయం కోసం చేస్తున్న ఉద్యమం 1000 రోజులు దాటినా ఈ మొండి ప్రభుత్వం కళ్లు తెరవడం లేదు
-మహా పాదయాత్ర మూడవరోజు తెనాలిలో మాజీ మంత్రి దేవినేని ఉమా

ప్రజా రాజధాని అమరావతి రక్షణ కోసం రైతులు మహిళలు చేపట్టిన మహా పాదయాత్రలో మూడవ రోజున తెనాలిలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని వారికి సంఘీభావం తెలియజేశారు. రాజధాని అమరావతిని అంగుళం కూడా కదల్చలేరని.. ప్రభుత్వం కుయుక్తులు పన్ని ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి రైతులు భరిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారని అన్నారు. రైతుల త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని.. న్యాయం కోసం చేస్తున్న ఉద్యమం వెయ్యి రోజులు దాటినా ఈ మొండి ప్రభుత్వం ఇంకా కళ్ళు తెరవడంలేదని దుయ్యబట్టారు.