అదే అసలైన ఆధ్యాత్మిక సాధన

వాయువు చేతనే మేఘం రావించబడి మరల వాయువు చేతనే తొలగింప(కొనిపో) బడుచున్నది. అలాగే, మనసు చేతనే బంధం, మోక్షం కల్పించబడుతున్నాయి’. మనసు సత్తరజస్తమో గుణాత్మకం. మనసు రజోగుణంతో ఉన్నప్పుడు కర్మలను ప్రేరేపిస్తుంది. ఇంద్రియభోగాలలో ఆసక్తిని కలిగిస్తుంది. ఫలితంగా రాగద్వేషాలు కలుగుతాయి. ఇంద్రియ విషయాలు అనుకూలంగా ఉన్నప్పుడు ‘సుఖం’, అనుకూలంగా లేనప్పుడు ‘దుఃఖం’ భావనలను కలిగిస్తుంది. మనసు తమోగుణంతో ఉన్నప్పుడు నిద్ర, సోమరితనం మొదలైనవి ప్రేరేపితమై వ్యర్థచేష్టలకు కారణమవుతుంది. మోహాన్ని కల్పించి మానవుని వివేకహీనుని చేస్తుంది. అదే మనసు…

Read More

వినాయకుడూ, సుబ్రహ్మణ్యుడూ… బ్రహ్మచారులా?

గణపతి ఉపాసన, కుమారస్వామి ఉపాసన విడివిడిగా చేసేటప్పుడు సిద్ధిబుద్ధి గణపతికి, వల్లీదేవసేనా కుమారస్వామికి ఉన్నట్లుగాను భావన చేస్తున్నాం. అమ్మవారి తనయులుగా వారిని భావించినప్పుడు శిశురూపంలోనే సాక్షాత్కరిస్తున్నారు. గణపతి – సిద్ధిబుద్ధి, కుమారస్వామి – వల్లీదేవసేనలను భార్యాభర్తలుగా అన్వయించడానికి వీలులేదు. శక్తులకు సంకేతం. అందుకే దీనిని “భ్రాంతిమాత్రదాంపత్యం” అంటారు. దాంపత్యం వంటిదే తప్ప దాంపత్యంకాదు. ఇది ఉపాసనాపరమైన మర్మం. గణపతికి సిద్ధిబుద్ధి భార్యలు, పుత్రులు క్షేముడు, లాభుడు. ఇవి సంకేతములు మాత్రమే. దేవతా విషయంలో స్త్రీలు అని చెప్పినప్పుడు…

Read More

దశావతారాల ఆవిర్భావం ఏమాసాలలో జరిగింది?

1. మత్స్యజయంతి :- చైత్ర శుద్ధ పంచమి అపరాహ్నంలో విష్ణువు మత్స్యావతారంగా అవతరించాడు.(ఎప్రియల్ లో వస్తుంది) 2. కూర్మజయంతి :- జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజు ప్రదోషవేల కూర్మావతరం జరిగింది.(జూన్ లో వస్తుంది) 3. వరాహ జయంతి:- చైత్ర శుద్ధ నవమి అపరాహ్నంలో అంటే మాధ్యాహ్నంకాలంలో జరిగింది. 4. నరసింహ జయంతి :- వైశాఖ శుద్ధ త్రయోదశి ప్రదోష కాలంలో జరిగింది🙏 5. వామన జయంతి:- భాద్రపద శుద్ధ ద్వాదశి మధ్యాహ్నంలో అభిజిత్ లగ్నంలో జరిగింది 6….

Read More

భగవంతునికి నీవు ఎంత దూరంలో వుంటే, భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు

తనను తానూ పాలించుకోలేనివాడు ఇతరులను పాలించాలనుకోవడం విచిత్రం. స్పష్టత లేకుండా మాట్లాడటం కంటే మౌనమే మిన్న. ఈ జగత్తు దేనిలో ఉంది? ఇదంతా ఏమిటి? దేని నుంచి ఇది ఆవిర్భవించింది? దేని కొరకు మరియు దేని చేత ఇది దృశ్యమానం అయ్యింది దేనిని ఇది కలిగియుంది? ఆత్మయే ఏకైక కారణం. నిజానికి ఉన్నది ‘ఆత్మ’ మాత్రమే. ప్రపంచం, జీవాత్మ, భగవంతుడు అన్నీ దానిలోని దృశ్యాలు. ఈ మూడు ఏకకాలంలో గోచరిస్తాయి, ఏకకాలంలో అదృశ్యం అవుతాయి. ఈ శరీరంలో…

Read More

దేవుడికి కోపతాపాలుంటాయా?

దేవుడికి కోపతాపాలుంటాయా? మనం ఏమైనా అంటే దేవుడికి కోపం వస్తుందా? దేవుడు మనలాగే ఉంటాడా? మనలాగే ఆలోచిస్తాడా? దేవుడు మనలాగే ఉంటాడని మనం అనుకుంటాం. పొగడితే ఉబ్బిపోతాడని, విమర్శిస్తే మండిపడతాడని భావిస్తాం. దేవుడో, దేవతో కత్తులు, కఠార్లు, శూలాలు పట్టుకుని తిరుగుతుంటారని, కోపం వస్తే కళ్లెర్రజేస్తూ శూలంతో పొడిచి చంపేస్తారని సినిమాల్లో చూపించడం, మనం వాటిని నమ్మేయడం జరుగుతుంటుంది. కానీ, వీటిల్లో నిజం లేదని అనేక మంది మహాత్ముల జీవితాల్లో నిరూపితమైంది. దేవుడిది ప్రేమతత్వం. మనుషులు చేసే…

Read More

విశేష యాత్రలు

ఏ ఆలయానికి వెళ్ళినా, ముందు శిఖర దర్శనం చేయాలి. తర్వాత ధ్వజ స్తంభం, స్వామి వాహన దర్శనం చేయాలి. వారి అనుజ్ఞతో మూల విరాట్ దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి దర్శనం ఇతర దేవతాదర్శనం చేయాలి. గంగాస్నానం చేసిన వారు గంగ నీటిని ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. కాని గంగ మట్టిని మాత్రం ఇంటికి తీసుకు వెళ్ళరాదు అని శాస్త్రం చెబుతోంది. కాశీ మహాస్మశానం కనుక ఆ మట్టి నిషిద్ధం అయి ఉంటుంది. మణికర్ణిక ఘాట్…

Read More

తపస్సు అంటే ఏమిటి? ఎందుకు చేయాలి?

తపస్సు అంటే ఇల్లు విడిచి పెట్టాలి, అడవులు పట్టాలి, ఆశ్రమాల్లో చేరాలి అని కాదు.భగవంతుని కోసం నిరంతరం తపించటాన్నే ‘తపస్సు’ అంటారు. మనోవాక్కాయ కర్మల యందు ఆధ్యాత్మిక చింతనతో తపించటాన్నే తపస్సు అంటారు.నిత్యకృత్యాలు నెరవేరుస్తున్నా భగవంతునితో అనుసంధానం అయి ఉండే కార్యాచరణను కావించటాన్నే తపస్సు అంటారు.ఈ విధంగా ప్రతి మానవుడు పారమార్ధిక ఆత్మనిగ్రహ ప్రయత్నాన్ని ఒక్కొక్క తపస్సుగా గ్రహిస్తాడు. అలా తపస్సు చేయటం వలన మల విక్షేప ఆవరణలు అనే త్రివిధ దోషాలు తొలగి పోతాయి.శ్రవణం చేత…

Read More

ఇది కథ కాదు!

తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు… ‘నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు!’ రావణుడు జటాయువు యొక్క రెండు రెక్కలను తెంచినప్పుడు… అప్పుడు మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు… “జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు….

Read More

గోత్రం అంటే ఏమిటి?

సైన్సు ప్రకారము మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనించండి. మీరు పూజలో కూర్చున్న ప్రతిసారీ, పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? మీకు తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు. గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు. జీన్-మ్యాపింగ్ అని ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన అధునాతన శాస్త్రమే! గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి ? మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది? వివాహాలకు ఇది…

Read More

తిరుప్పావై అంటే ఏమిటి?

తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంధం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గం. ‘తిరు” అంటే శ్రీ అని, ”పావై” అంటే పాటలు లేక వ్రతం అని అర్ధం. కలియుగంలో మానవకన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. తిరుప్పావై లో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా…

Read More