పంచభూత స్థల లింగాలు అంటే ఏవి? ఎక్కడ ఉన్నాయి..?

పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు. పృథ్విలింగం ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి. ఆకాశలింగం ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు….

Read More

నాగుల చవితి

దీపావళి తరువాత వెంటనే వచ్చే చక్కటి పండుగ ‘నాగుల చవితి’. నాగుల చవితి నాడు ప్రొద్దున్నే లేచి, మా గ్రామం లో పిల్లలూ పెద్దలు అందరూ వూరి చివర గరువులో ఉన్న పెద్ద పుట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అందరు పుట్టకి పూజ చేసి, పాలు, అరటి పళ్ళు, పుట్ట కలుగు లో వేసేవారు. కొందరు కోడి గ్రుడ్లు కూడా వేసే వారు. పుట్ట మన్ను భక్తిగా చెవులకు పెట్టుకునే వాళ్ళం. ఇంటి దగ్గర మా అమ్మగారు, పూజ…

Read More

శివుడంటే..

” శివుని ధ్యానించే ముందు ,చింతించే ముందు , శివుడి స్వరూపం ఏమిటో చక్కగా తెలుసుకోవాలి . శివుడి స్వరూపం ఏమిటో తెలియని వారు , శివుని సదా ధ్యానించలేరు . నిరంతరం చింతించ లేరు , శివానందములో రమించలేరు. శివుడి స్వరూపాన్ని పరిపూర్ణంగా గ్రహించినవారే , శివుడంటే ఎవరో చక్కని ధృఢ జ్ఞానాన్ని సొంతం చేసుకుంటారు. పూర్ణ జ్ఞానాన్ని కలిగి వుంటారు . నిజమైన స్య్జానాన్ని సొంతం చేసుకుంటారు. ఇక శివుడి స్వరూపం నామం ,రూపం…

Read More

శివునికి సోమ‌వార‌మే ఎందుకు?

శివున్ని పూజించే భ‌క్తులంతా సోమ‌వారం రోజున ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌డం స‌హ‌జం. ఆ రోజునే ఉప‌వాసం ఉంటారు చాలామంది.ఎందుక‌ని..? అంటే…. సోముడు అంటే చంద్రుడు. మనకు ఉన్న వారాల పేర్లన్నీ గ్రహాలను అనుసరించి వచ్చాయి. చంద్రుని వారం సోమవారం. చంద్రుని ధరించినవాడు శివుడు. చంద్రుడే సోముడు కనుక శివుని చంద్రశేఖరుడు అనీ, సోమశేఖరుడు అని పిలుస్తారు. చంద్రునికి ప్రత్యేకించి ఆలయం లేనందున శివుని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు. సోమ అనే శబ్దాన్ని స+ఉమ అని విడగొడితే…

Read More

కార్తీకమాసం

కార్తీకముతో సమానమైన మాసము లేదు. విష్ణు దేవునితో సమానమయిన దేవుడు లేడు. గంగతో సమానమగు తీర్థము లేదు అని చెప్పబడినది.తెల్లవారుజామునే నిద్రలేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానం చేయడం, బోళాశంకరునికి నిత్యమూ రుద్రాభిషేకం చేయడం, నుదుట విభూతిని మెడలో రుద్రాక్షల్నీ- లేదా- తులసి పూసల్ని ధరించండం రోజుకి ఒక పూట మాత్రమే భుజించడం, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయడం…ఒకటేమిటి? ఇలా ఎన్నెన్నో సంప్రదాయాలని మూటగట్టుకుని తెచ్చింది పవిత్రమైన ఈ కార్తీకమాసం.ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో…

Read More

దేవునికి దీపం ఎలా వెలిగించాలి?

దేవుడి విగ్రహానికి లేదా పటానికి ధూపధీప నైవేద్యాలు సమర్పించటం మన ఆరాధనా పద్ధతి. ఉదయము వెలిగించు దీపము కన్నా ప్రదోష కాలమందు వెలిగించు దీపం అత్యంత మంగళకరమైనదిగా పెద్దల మాట. పూజలో అత్యంత ముఖ్యమైన దీపం ఆ తర్వాత ధూపం, పుష్పాలు, పసుపు కుంకుమలు, గంధచందన విభూతులు, కొబ్బరికాయ, అరటిపండ్లు వక్క, తమలపాకులు, మంగళ హారతి మొదలగునవి క్రమానుగతిలో ప్రాధాన్యము కలిగినటువంటివి. కావున పూజ చేయువారిపై వీటి అనుకూల శక్తి, ప్రభావము వెంటనే పడుతుంది. అష్టోత్తరములు మరియు…

Read More

కంచిలో బంగారు బల్లి కథ

బంగారు బల్లి అంటే ఎవరికైనా యిట్టె గుర్తొచ్చేది తమిళనాడులోని కంచి కామాక్షి అమ్మవారి ఆలయం. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని ముట్టుకుంటే, దోషం వెళ్లి ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ బంగారు బల్లి గురించి ఒక పురాణ గాధ ఉంది. అదేమిటంటే గౌతమ మహర్షి కి ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఎప్పటిలాగే శిష్యులు కుండ పట్టుకొని నది తీరానికి వెళ్లి, నీటిని తీసుకొస్తుండగా అందులో బల్లి పడింది. వారు చూసుకోలేదు. దీన్ని…

Read More

సత్ సాంగత్యం

అవతారం చాలించే ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పిన మాటలు అత్యంత విలువైనవి. అందరూ గుర్తుంచు కోవలసినవి. ఆచరించవలసినవి. అదే ఉద్ధవగీత గా చెప్పబడుతోంది. ఆయన అంటాడు ‘ఉద్ధవా! నీవు నాకు సేవకుడవు, సఖుడవు, సహృదయుడవు. నీకొక రహస్యమైన విషయమును చెప్పెదను, వినుము. సత్సంగం అనేది లోకంలో అన్ని విధాలైన ఆసక్తులను నశింపచేస్తుంది. యోగము, సాంఖ్యము, అనుష్టానము, స్వాధ్యాయము, తపస్సు, సన్యాసము, యజ్ఞయాగాదులు, వివిధములైన వైదిక కర్మలు, వ్రతాలు, పూజలు, రహస్యమగు మంత్రాలు, హోమనియమాలు, తీర్థయాత్రలు మున్నగు వాటన్నిటికన్నా…

Read More

ఆకాశదీపం ఎందుకు వెలిగించాలి?

ఆకాశదీపం ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం. శివ కేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీకమాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’ వెళ్లాడ దీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశదీపం పితృదేవతలకు మార్గాన్ని చూపుతుంది తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి … ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి…

Read More

గోసేవకు వరం

ఒకసారి అర్జునుడు, శ్రీ కృష్ణుడు ఒక వృద్ధ విధవరాలి ఇంటికి అతిథులుగా వెళ్లారు. ఆ వృద్ధ విధవరాలు శ్రీకృష్ణునికి పరమ భక్తురాలు కూడ. ఆమె నిత్యం కన్నయ్యను స్మరిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది. ఆమెకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. సమాజ సేవ చేసుకుంటు ఈ లోకం లో ఆ భక్తురాలు ఉండేది ఒక పూరి గుడిసెలో..! ఆమె వద్ద ఒక ఆవు ఉండేది. ఆమె ఆ గోమాత ప్రసాదించిన పాలను గ్రామ వాసులకు దానం ఇచ్చి…

Read More