నలిగిపోతున్న బాల్యం..
నీ బిడ్డ భవిత
నీ కళ్ళ ముందే
చిక్కి శల్యం..!
నీ చిన్నతనం గురించి
గొప్పలు పోయే నువ్వు
అదే సంబరాన్ని
నీ పిల్లలకు దూరం చేస్తావా..?
ఎక్కడ ఆటలు..
ఎక్కడ తోటలు..
నాలుగు గోడల మధ్యే
నీరసించిపోతున్న
చిన్నారులు..
కుహానా సంస్కారాలు..
కృత్రిమ సంస్కృతులు..
బాల్యాన్ని మింగేస్తుంటే
అదే గొప్పని
చంకలు గుద్దుకునే నీ నైజం..
నీకు నువ్వే పెంచుకుంటున్న విలనిజం..!
స్వేచ్ఛా విహంగాల్లా ఎగరాల్సిన వయసును..
తుళ్ళి పడే మనసును
రాతి కట్టడాల నడుమ..
కుళ్ళు కట్టడుల మధ్య
బంధిస్తున్న నీ...
నాన్న..
నిన్ను చిన్నప్పటి నుంచి
కంటికి పాపలా చూసుకున్నాడని అనుకుంటున్నావేమో..
తన రెండు కళ్లూ నువ్వే అయి నిను కాచాడు..!
నీకు కష్టం వచ్చినప్పుడు
తన రెండు చేతులూ చాచి
దగ్గరకు తీసుకున్నాడని
మురిసిపోతున్నావేమో..
అంతకు మించి తన గుండె తలుపులు తెరిచి అక్కడ
నిన్ను పొదుగుకుని
నీకు ఊరట కల్పించాడు..
తానూ అలా సేదదీరాడు..!
నీతో పాటు బయటికి వచ్చినప్పుడు నువ్వు అది కొను ఇది కొను అన్నప్పుడు
జేబులు చూసుకుంటూ
నిన్ను...
హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండివంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు. మన పెద్దలు అనుసరించే సంప్రదాయాల వెనకున్న మర్మం ఏమిటి? వాటి నుంచి మనమేం నేర్చుకోవాలి? ఛాందసత్వానికి పోకుండా శాస్త్రీయంగా ఎలా అర్థం...
ఒక్కసారి వెనక్కి వెళ్తే..
కాలచక్రం నన్నోసారి
గతంలోకి తీసుకుపోతే..
చేజార్చుకున్న అవకాశాలు..
మరచిపోయిన అనుభూతులు..
వెళ్లిపోయిన మనుషులు..
నిర్లక్ష్యం చేసిన సమయం..
ఒడిసిపట్టుకోలేనా..
అసాధ్యమే..
కానీ..కాస్త అనుభూతిస్తే..
ఓ వింత హాయి..
అందమైన గతం..
కొంతైనా అవగతం..!
ఒక్కసారి వెనక్కి వెళ్తే..
తీసుకున్న నిర్ణయాలు
మార్చగలమని కాదు..
తీసుకునే ముందు
ఒకటికి రెండుసార్లు
ఆలోచించవచ్చని..!
చిన్నపిల్లాడిని అయిపోతే..
మళ్లీ బుడిబుడి అడుగులు
వేయాలని కాదు..
నేను వేస్తున్నప్పుడు మురిసిపోయిన
అమ్మ మోము చూడాలని..!
బడి రోజులు తిరిగి రావాలని..
ఏదో నేర్చుకోవాలని కాదు..
బడి వదిలేసిన తర్వాత ఇప్పటివరకు కలవలేకపోయిన స్నేహితులతో...
2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం ప్రారంభమయింది. అంతకుముందు 1935 నుండి 2007 వరకు జనవరి 14ననే పండుగ. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒకరోజు తర్వాతకు మారుతుంది.
1935 నుండి 2007 వరకు జనవరి 14న,
2008 నుండి 2080 వరకు జనవరి 15న,
2081...
సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి...
పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ...
- ఆరు టన్నుల గో పేడతో గుమ్మిలేరులో కిలోమీటరు భోగి దండ
( కొంగర దుర్గాప్రసాద్)
తెలుగు లోగిళ్లల్లో జరుపుకునే సంక్రాంతి సంబరాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోనూ గోదావరి జిల్లాల వాసులు ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ జిల్లాల్లో కూడా కొన్ని గ్రామాల్లో సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటి...
రెండు మూడు తరాల నుంచీ స్వయంగా పొలాల్లోకి దిగి వ్యవసాయము చేసే రైతులము కాకపోయినా, కాస్త భూమి కలిగినవారిమే. నాకు కూడా దున్నడం(మూడు నాలుగుసార్లు), ఎడ్లబండి నడపడం, కోడెగిత్తలని ఏట్లో నడిపించడం కొంత అనుభవమే. దీపావళి పండుగ ఒకరోజు కోసం పిల్లలుగా ఎదురుచూసేవారం. కానీ సంక్రాంతి కుటుంబం, కుటుంబాలు.. ఊరు కలసి జరుపుకునే పండుగ....
రాత్రి భోజనాల తర్వాత ఒకటీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది.
ఆమె పిల్లలు పడుకున్నారు!
భర్త కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు.
చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది.
ఆ ఏడుపు వెక్కిళ్ళ శబ్దానికి భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!
"ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?...
హృదయం కదిలించే సంఘటన
స్కూల్ టూర్ కోసం వృద్ధాశ్రమానికి వెళ్తే అక్కడ నానమ్మ కనిపించింది వంద మాటల్లో చెప్పలేని విషయాలను ఒక్క ఫొటోతో చెప్పొచ్చంటారు. అలాంటి ఒక ఫొటో ఇది. ఒక స్కూల్ యాజమాన్యం విద్యార్థులను వృద్ధాశ్రమానికి తీసుకెళ్లింది. అక్కడ ఈ ఫొటోలో ఉన్న అమ్మాయికి తన నానమ్మ కనిపించింది. దాంతో ఇద్దరూ ఇలా కన్నీళ్లు...