అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోండి: రాహుల్ గాంధీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం వివాదాస్పదంగా మారింది. ఈ పథకాన్ని నిరసిస్తూ దేశంలో పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ… రైతుల సుదీర్ఘ నిరసనల అనంతరం వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని గుర్తు చేశారు. ఇదే విధంగా సైనిక నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ ను కూడా వెనక్కి తీసుకోక తప్పదని అన్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదని తాను గతంలోనే చెప్పానని… చివరకు తాను…

Read More

రైల్వే ఆస్తులు ధ్వంసం చేయొద్దు

-రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విజ్ఞప్తి సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాలావధితో ఉద్యోగ నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ తీవ్ర ఆందోళనలకు కారణమవుతోంది. ఈ పథకంతో తాము నష్టపోతామని ఆర్మీ ఆశావహులు దేశవ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా రైల్వే ఆస్తులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. యువత హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొనరాదని, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్రం…

Read More

అగ్నిపథ్​పై కేటీఆర్ ఎద్దేవా

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న హింసాత్మక నిరసనలు దేశంలో నిరుద్యోగ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు నిదర్శనం అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఆందోళనలు చూసైనా కేంద్రం కళ్లు తెరవాలన్నారు. తొలుత రైతులతో ఆటలాడుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జవాన్లతో ఆడుకుంటోందని విమర్శించారు. సాయుధ బలగాల విషయంలో కేంద్రం తీరు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ నుంచి నో ర్యాంక్ నో పెన్షన్ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. అగ్నిపథ్…

Read More

సికింద్రాబాద్​ అల్లర్లపై ఆరా తీసిన కేంద్ర హోం మంత్రి అమిత్​ షా

కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఉదయం జరిగిన విధ్వంసంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ అయిన కిషన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. హింసకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీసినట్టు సమాచారం. ఇప్పటిదాకా ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితం అయిన ఆందోళనలు క్రమంగా…

Read More

ఇంకా ఆసుపత్రిలోనే సోనియా

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై ఆ పార్టీ తాజా సమాచారం విడుదల చేసింది. కరోనా అనంతర సమస్యలతో సోనియా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ముక్కు నుంచి రక్తం రావడంతో ఈ నెల 12వ తేదీ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో సోనియా చేరారని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ తెలిపింది. వైద్యులు ఆమెకు వెంటనే చికిత్స చేశారని చెప్పింది. గురువారం ఉదయం మరోసారి ఆమెకు పరీక్షలు నిర్వహించారని తెలిపింది. ఈ క్రమంలో సోనియా…

Read More

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆగని ఆందోళనలు..

సాయుధ దళాల్లో నాలుగేళ్ల స్వల్పకాల ఉపాధి కార్యక్రమం ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, హింసాత్మక ఘటనలు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులు రైళ్లకు నిప్పు పెట్టారు. బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నిరసనలు అదుపు తప్పాయి. పలు చోట్ల ఆందోళనకారులు రైళ్లకు నిప్పు పెట్టారు. యూపీలోని వారణాసిలో బస్సును ధ్వంసం చేశారు. వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ బయట వెండింగ్ కార్ట్ లను ధ్వంసం చేశారు. బలిలాలో స్టేషన్…

Read More

త్వరలోనే అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ ఉంటుంది: ఆర్మీ చీఫ్

త్రివిధ దళాల్లో రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నపథ్ పథకం దేశ వ్యాప్తంగా పలు చోట్ల హింసను రాజేసింది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు పలు చోట్ల నిరసన కార్యక్రమాలను చేపట్టారు. రైళ్లకు నిప్పుపెడుతున్నారు. సికింద్రాబాద్ లో సైతం ఒక రైలును అగ్నికి ఆహుతి చేశారు. అయినప్పటికీ కేంద్రం కానీ, ఆర్మీ కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఈ రోజు కీలక…

Read More

అగ్నిపథ్​ పథకంలో కీలక మార్పు.. వయో పరిమితి పెంపు

భారత త్రివిధ దళాల్లో నాలుగేళ్ల పాటు సేవలు అందించేందుకు యువతకు అవకాశం ఇచ్చేలా కొత్తగా ప్రవేశ పెట్టిన ‘అగ్నిపథ్’ పథకాన్ని నిరసిస్తూ వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో అభ్యర్థుల వయో పరిమితిని రెండేళ్లు పెంచింది.తొలుత 17 ఏళ్ల నుంచి 21 ఏళ్ల యువకులు ఈ పథకానికి అర్హులని కేంద్రం ప్రకటించింది. తాజాగా గరిష్ఠ వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచింది. అయితే, ఇది ఈ ఏడాదికి…

Read More

నో పార్కింగ్ ప్లేస్‌లో వాహనం ఫొటో తీసి పంపితే నజరానాగా జరిమానాలో సగం!

రోడ్డుపై వెళ్తుండగా నో పార్కింగ్ స్థలంలో వాహనం కనిపిస్తే వెంటనే ఫొటో తీసి పంపిస్తే నజరానా మీ సొంతమవుతుంది. రోడ్లపై ఇష్టానుసారంగా పెరిగిపోయి తీవ్ర రద్దీకి కారణమవుతున్న అక్రమ పార్కింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఓ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాంగ్ పార్కింగ్ వాహనాలను ఫొటోలు తీసి అధికారులకు పంపిస్తే.. ఆ వాహనానికి విధించే జరిమానాలో సగాన్ని ఫొటో పంపిన వ్యక్తికి ఇవ్వనున్నట్టు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ…

Read More

విండోస్ వాడుతున్న వారు అర్జంటుగా అప్ డేట్ చేసుకోవాలంటున్న మైక్రోసాఫ్ట్

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఓ లోపం ఉన్నట్టు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గుర్తించింది. ఈ లోపం సాయంతో హ్యాకర్లు కంప్యూటర్లలోకి చొరబడి సమాచారాన్ని తస్కరించడం కానీ, మార్పులుచేర్పులు చేసేందుకు కానీ వీలవుతుందని మైక్రోసాఫ్ట్ ఆందోళన చెందుతోంది. విండోస్ 7, ఆపై వెర్షన్లు ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే తమ సిస్టమ్ ను అప్ డేట్ చేసుకోవాలని హెచ్చరించింది. ఈ మేరకు, సెక్యూరిటీ ప్యాచ్ ను రిలీజ్ చేసింది. వీలైనంత త్వరగా అప్ డేట్ ను ఇన్ స్టాల్…

Read More