ఈడీ విచార‌ణ‌కు రాహుల్‌.. అడ్డుకున్న నేత‌ల అరెస్ట్‌

దిల్లీ: నేష‌న‌ల్ హెరాల్డ్ మ‌నీ లాండ‌రింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీని ఈడీ విచార‌ణ‌కు తీసుకెళ్లిన నేప‌ధ్యంలో సోమ‌వారం కాంగ్రెస్ పార్టీ నేత‌లు దేశ‌వ్యాప్త నిర‌స‌న‌కు దిగారు. నేత‌ల నుంచి పెద్ద ఎత్తున ల‌భించిన మ‌ద్ద‌తుతో రాహుల్‌గాంధీ ఈడీ కార్యాల‌యానికి చేరుకున్నారు. ఈ క్ర‌మంలో ఎటువంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా నిర‌స‌కారుల్ని పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ నిలువ‌రించారు. ఈ నేఫ‌ధ్యంలో దిల్లీలోని జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయ‌కులు అంద‌రు ఏఐసీసీ కార్యాల‌యం నుంచి ర్యాలీగా బ‌య‌లుదేరి ఈడీ…

Read More

నరేంద్ర మోడీ నిరంకుశ పాలనకు నిదర్శనం!

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలను “నరేంద్ర మోడీ జేబు సంస్థలుగా” మార్చుకొని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులైన సోనియా గాంధీ రాహుల్ గాంధీ లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ అక్రమ కేసులు బనాయించి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని బిజెపి కక్ష సాధింపు ధోరణితో అధికార దుర్వినియోగానికి పాల్పడటాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారు! బీజేపీ అధికార దాహంతో మత విద్వేషాలను రెచ్చగొట్టి…

Read More

దేశంలో కరోనా కేసులు : గత 24 గంటల్లో 8,084 కేసుల నమోదు

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళనను పెంచుతోంది. వరుసగా మూడో రోజు 8 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,084 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,592 మంది కోలుకోగా… 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 47,995 యాక్టివ్ కేసులు ఉన్నాయి.india-reports-8084-covid19-cases తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,32,30,101కి పెరిగాయి. ఇప్పటి వరకు 4,26,57,335 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం…

Read More

పోలీసుల అదుపులో శ్రద్ధా కపూర్ సోదరుడు

బాలీవుడ్ నటుడు శక్తికపూర్ కుమారుడు సిద్ధార్థ కపూర్ ఓ రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయాడు. డ్రగ్స్ సేవించిన అతడ్ని బెంగళూరు పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఎంజీ రోడ్డులో రేవ్ పార్టీ జరుగుతున్న హోటల్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 35 మంది నుంచి నమూనాలు తీసుకుని ల్యాబ్ కు పంపించారు. అందులో సిద్ధార్థ కపూర్ సహా ఆరుగురు డ్రగ్స్ సేవించినట్టు పరీక్షల్లో తేలింది. డ్రగ్స్ సేవించి పార్టీకి వచ్చారా..? లేక హోటల్లో…

Read More

గిరిజన మహిళకు రాష్ట్రపతి అవకాశం?

– ఉప రాష్ట్రపతిగా నబ్బాస్ నక్వీ? – బీజేపీ కసరత్తు ( శ్రీరాంప్రసాద్ మొవ్వా) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి విషయంలో బీజేపీ హైకమాండ్‌ అన్ని రకాల ఫార్ములాలపైన కసరత్తు చేస్తోంది. ఈసారి రాష్ట్రపతిగా మహిళ అభ్యర్థిని బరిలో నిలపాలని డిసైడ్ అయినట్టు సమాచారం. అలాగే ఉపరాష్ట్రపతిగా మైనార్టీ నేతకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. మోదీ, షా ద్వయం దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఉప రాష్ట్రపతి రేసులో కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్…

Read More

నేషనల్ హెరాల్డ్ కేసుతో తప్పుడు ప్రచారం

– సోనియా, రాహుల్ గాంధీ నిజాయితీతో ఉన్నారు – కావాలనే ప్రతిపక్షాల దుష్ప్రచారం – ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ విజయవాడ : నేషనల్ హెరాల్డ్ కేసు నమోదు ద్వారా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, యువ నేత రాహుల్ గాంధీ పై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిజాయితీగా ఉన్నా…

Read More

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోడీ

– నల్లధనం తెచ్చేదెప్పుడు? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చేది ఎన్నడూ? – దేశ ప్రజలపై రూ.80 లక్షల కోట్ల అప్పుల భారం – అంబానీ, ఆధానీల ఆస్తులను పెంచుతున్న మోడీ – ప్రజలను మోసం చేయడంలో మోడీ, కేసీఆర్ దొందూ దొందే.. – పీపుల్స్ మార్చ్ పాదయాత్ర లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోడీ అపహాస్యం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. డాక్టర్ బాబాసాహెబ్…

Read More

లౌకిక, ప్రజాస్వామిక వాదులు రాష్ట్రపతి ఎన్నికల కోసం ఏకం అవ్వాలి

-రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు బీజేపీ యేతర పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలి -భారత రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి, ఆర్ఎస్ఎస్ కుట్రలు తిప్పికొట్టే సమయం ఆసన్నమైంది -దేశభక్తులు, రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళు, ప్రజాస్వామ్యం కావాలనుకునేవారు సెక్యులర్ వైపు -ఆర్ ఎస్ ఎస్ భావజాలం, మనువాదం మతతత్వం కోరుకునేవారు బిజెపి వైపు -దేశంలోని రాజకీయ పార్టీలు ఎటువైపు ఉంటాయో ఈ ఎన్నికలతో తేలిపోతుంది భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు, ఆర్ఎస్ఎస్, బిజెపి భావజాలాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఒక వేదికగా…

Read More

రాహుల్ కు అండగా 13న కాంగ్రెస్ ఆందోళన

-విచారణ పేరిట సోనియా రాహుల్ ను వేధించాలని చూస్తే యావత్ జాతి తిరగబడుతుంది -దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణాలు ఇచ్చిన ఇందిరమ్మ వారసులు ఈ.డి, ఐ.టీ నోటీసులకు భయపడతారా? -దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబంపై బిజెపి రాజకీయ కక్ష్య సాధింపు -ఆస్తులను జాతికి అంకితం చేసి సొంత ఇల్లు లేని గాంధీ కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గు చేటు -వచ్చే ఎన్నికల్లో బిజెపి ని రాహుల్ గాంధీ గద్దె దింపడం ఖాయం -కాంగ్రెస్ కార్యకర్తలు…

Read More

జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక

దిల్లీ: దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ ఖరారైంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్‌ నిర్వహించనున్నారు. జులై 21న కౌంటింగ్‌ చేపట్టనున్నారు.ఈ నెల 15వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ గురువారం వెల్లడించారు. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ పదవీకాలం జులై 24తో ముగియనుంది. ఎన్నిక ప్రక్రియ ఎలా జరుగుతుందంటే.. రాష్ట్రపతిని ఎలక్టోరల్‌…

Read More