‘హెలికాఫ్టర్ మనీ’ అంటే..?

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. కానీ దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. వస్తు, సేవల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఆర్థిక వ్యవ్వస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం నుంచి 2.8 శాతానికి పడిపోవచ్చని ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు హెలికాఫ్టర్ మనీ, క్యూఈ […]

అవసరం ఉంటే తప్ప బ్యాంకులకు రావొద్దు

మాకు మీ సాయం కూడా అవసరం: బ్యాంకు ఉద్యోగుల సంఘం విన్నపం ఆన్‌లైన్, మొబైల్ సేవలను వినియోగించుకోండి అన్ని రకాల సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం అందరూ ఎదుర్కొంటున్న సమస్యనే ఉద్యోగులూ ఎదుర్కొంటున్నారు బ్యాంకు ఖాతాదారులకు అన్ని సేవలు అందిస్తామని అయితే, అత్యవసరం అయితే తప్ప బ్యాంకుకు రావొద్దని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీవో) విజ్ఞప్తి చేసింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, శక్తివంచన లేకుండా పనిచేస్తామని పేర్కొంది. వీలైనంత వరకు అన్ని సేవలు అందిస్తామని, […]

రూ.100 కోట్ల విరాళం అందించిన వేదాంత గ్రూప్ చైర్మ‌న్

పెద్ద మ‌న‌సు చాటుకున్న వేదాంత గ్రూప్ చైర్మ‌న్. రూ.100 కోట్ల భారీ విరాళం అందించిన అనిల్ అగ‌ర్వాల్. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ ప్రాణాంతక వైరస్‌తో పోరాటానికి కార్పొరేట్‌ దిగ్గజాలు కూడా ముందుకొస్తున్నారు. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి తన వంతుగా రూ. 100 కోట్ల భారీ విరాళాన్ని ఇస్తున్నట్టు వేదాంత గ్రూప్స్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. విపత్కర పరిస్థితుల్లో […]

ఏప్రిల్ 1 నుండి బిఎస్ 6 వాహనాలు అమ్మకాలు జరగాలి

పత్రికా ప్రకటన డిటిసి కార్యాలయం విజయవాడ. తేదీ 20/02/2020 ఏప్రిల్ 1 నుండి బిఎస్ 6 వాహనాలు అమ్మకాలు జరగాలి – డిటిసి ఎస్ వెంకటేశ్వరరావు జిల్లాలోని వాహన డీలర్లు ఏప్రిల్ 1వ తారీఖు నుండి BS VI ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జరపాలని డిటిసి ఎస్ వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక బందర్ రోడ్డు లోని డిటిసి కార్యాలయం నుండి మంగళవారంనాడు ఒక ప్రకటనను విడుదల చేశారు. డిటిసి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర […]

దిగొచ్చిన బంగారం

వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. గత రెండు నెలల్లో 2 వేల రూపాయలకు పైగా పతనమైంది. ఇటీవల కాలంలో అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్లిన్న బంగారం ధర… ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. మరో వైపు వెండి ధర కూడా తగ్గుతోంది. గత సెప్టెంబర్‌లో 40 వేల రూపాయల మార్కును దాటిన పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం… ఇప్పుడు 38 వేల రూపాయల స్థాయికి దిగివచ్చింది. అలాగే, పది గ్రాముల 22 క్యారెట్ల పసిడి […]

శుక్రవారం పెట్రోల్ ధరల్లో 18 పైసల నుంచి 20 పైసల వరకు పెరుగుదల నమోదైంది.డీజిల్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 20 పైసలు పెరిగి రూ. 78.36 కి చేరగా లీటర్ డీజిల్ ధర రూ. 71.80 వద్ద కొనసాగుతోంది. అమరావతిలోనూ ఇదే పరిస్థితే ఉంది. అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 18 పైసలు పెరిగి రూ. 77.95 కు చేరింది. ఇక డీజిల్ ధర రూ. 71.10 వద్ద […]

స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఆపిల్ డేస్ సేల్స్, ఒప్పో పెంటాస్టిక్ డేస్ పేరుతో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్లు ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రకటించింది. ఐఫోన్లపై రూ. 23,000 డిస్కౌంట్ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ ఎడిషన్‌పై రూ. 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఐఫోన్ 11 సిరీస్‌ ఫోన్లపై తక్షణ డిస్కౌంట్ లభించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు, ఈఎంఐ ద్వారా ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ఫోన్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు తక్షణ […]

మరింత క్షీణించిన రూపాయి

రూపాయి విలువ మరింత క్షీణించింది. బుధవారం మధ్యాహ్నానికి… డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 56 పైసలు కోల్పోయి 72.02గా కొనసాగుతోంది..డాలరుతో పోల్చుకుంటే రూపాయి విలువలో ఇంత అస్థిరత ఇటీవలి కాలంలో లేదని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.ఇదే క్రమంలో సెన్సెక్స్ కూడా 504 పాయింట్లకు పడిపోయింది.  భారీనష్టాల్లో స్టాక్‌మార్కెట్లు మధ్యాహ్నం వరకు సూచీలు ఫ్లాట్‌గా ట్రేడ్ అయినప్పటకీ 2 గంటల తర్వాత ఒక్కసారిగా కుప్పకూలాయి. ఎకనామిక్ డేటా విడుదల కానున్న నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని ప్రదర్శించారు. […]

ఇన్ఫోసిస్‌లో ముదురుతున్న వివాదం

టెక్‌ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ వివాదం మరింత ముదురుతోంది. సెప్టెంబర్ 20 న బోర్డుకు 2 పేజీల లేఖలో అనైతిక పద్ధతులపై ఆరోపించిన స్వల్ప వ్యవధిలోనే మళ్లీ ఇలాంటి ఫిర్యాదు రావడం ఇది రెండోసారి. విజిల్ బ్లోయర్‌ ఈ ఆరోపణలు రేపిన సెగ ఇంకా చల్లారకముందే, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌పై మరో విజిల్‌ బ్లోయర్‌ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు సలీల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇన్ఫీ చైర్మన్‌ నందన్ నీలేకనితోపాటు, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌కు ఒక లేఖ […]

2020 నుంచి ఉచితంగా నెఫ్ట్‌ సేవలు

సేవింగ్‌  బ్యాంకు ఖాతాదారులకు  రిజర్వ్‌బ్యాంకు  ఆఫ్‌ ఇండియా  శుభవార్త చెప్పింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిస్టమ్‌ (నెఫ్ట్‌)  సేవలు  2020 జనవరి నుంచి ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ లావాదేవీలపై ఎలాంటి చార్జీలను విధించబోమని ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. తమ నిర్ణయం మేరకు బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలని ఆర్‌బీఐ కోరింది. సమర్థవంతమైన, సౌకర్యవంతమైన, సురక్షితమైన, సురక్షితమైన పేమెంట్ వ్యవస్థలను స్థాపించడం ఆర్‌బీఐ లక్ష్యమని, ఈ ప్రయత్నాల ఫలితంగా రిటైల్ డిజిటల్ […]

మళ్ళీ నోటు రద్దా?

మూడేళ్ళ క్రితం పెద్ద నోట్లు రద్దు జరిగింది.ఈ నోట్ల రద్దుతో దేశంలో ఆర్ధిక వ్యవస్థ కొంతమేర కుంగిపోయింది.  దీని నుంచి దేశంలో త్వరగానే కోలుకుంది.పెద్ద నోట్లను రద్దు చేసిన వెంటనే ప్రభుత్వం వంద, ఐదు వందలు, రెండువేల రూపాయల నోటును రిలీజ్ చేసింది. 2000 నోటు బాగా విపణిలోకి వచ్చింది.  ప్రస్తుతం ఈ నోటు ముద్రణను ఆర్బిఐ నిలిపివేసిన సంగతి తెలిసిందే.  అయితే, 2000 రూపాయల నోట్లను ఎక్కువ మొత్తంలో విపణిలోకి రిలీజ్ చేసినా…అవి ఇప్పుడు బయట […]

ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ పథకాన్ని ప్రకటించిన బీఎస్‌ఎన్‌ఎల్‌

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌).. తన ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్‌) ప్రకటించింది. ఈ నెల 4న ప్రారంభమైన వీఆర్‌ఎస్‌ పథకం.. డిసెంబరు 3 వరకు అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీకే పుర్వార్‌ తెలిపారు. గడువు చివరి తేదీలోగా ఈ పథకాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. వీఆర్‌ఎస్‌ పథకంపై ఇప్పటికే క్షేత్రస్థాయి యూనిట్లన్నింటికీ సమాచారం పంపడం జరిగిందని పుర్వార్‌ వెల్లడించారు. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌లో 1.5 […]

%d bloggers like this: