రఘురాముడి బాణాలు తగిలేదెవరికి?

నిమ్మగడ్డ, టీటీడీ భూములపై వైసీపీ ఎంపీ రూటు సెపరేటు బీజేపీతో దోస్తానా వద్దన్నా బేఖాతర్ సొంత పార్టీ నేతల భూదందాపై తాజాగా ఫైర్ హస్తినలో కమలదళాలతో చెట్టపట్టాల్ వైసీపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంతబాట (మార్తి సుబ్రహ్మణ్యం) ఆయన పేరు చివరిలోనే రాజు అనే గంభీరమైన అక్షరాలున్నాయి. కాబట్టి ఎవరినీ ఖాతరు చేయరు. తనకు తోచింది, తన మనసుకు నచ్చింది, తన ఆత్మసాక్షిగా అనుకున్నదే చెబుతారు. ఏ అంశంపైనయినా  కుండబద్దలు కొట్టడం ఆయన నైజం. తన వ్యాఖ్యల వల్ల […]

దేశ ప్రజలకు,బిజెపి కార్యకర్తలకు అభినందనలు:నడ్డా

బహుముఖ అభివృద్ధి కై, దేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ రెండవ పదవీకాలం ఒక సంవత్సరం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ , కేంద్రం హోం మంత్రి అమిత్ షా  తరపున మరియు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా  దేశ ప్రజలకు, కోట్లాది మంది బిజెపి కార్యకర్తలకు అభినందనలు తెలుపారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా  సందేశం : 🔸 […]

అవును.. కమలం పువ్వు నవ్వింది!

జగన్మోహనపాలన జనరంజకమే వైసీపీతో బీజేపీ సంబంధాలు బ్రహ్మాండమట మోదీ-జగన్ కలసే పనిచేస్తున్నారు ‘వారణాసి’ కితాబు.. జగన్‌కు మతాబు మరి జగనన్న సర్కారుపై కమలదళం కేకలెందుకు? మత మార్పిళ్ల ఆరోపణలన్నీ ఉత్తిదేనా? కమలదళాన్ని ఖంగుతినింపించిన ‘రామ’బాణం రాంమాధవ్ వ్యాఖ్యలతో వైసీపీ కళకళ.. కమలం వెలవెల పదినెలలకే పదాలు మార్చిన రాంమాధవ్ తర్వాత మసిపూసిమారేడు కాయ చేశారని వివరణ (మార్తి సుబ్రహ్మణ్యం) ‘రాష్ట్రంలో ప్రజల పరిస్థితి పొయ్యి నుంచి పెనంలో పడినట్టయింది. జగన్‌ను గెలిపించి తప్పుచేశామని ప్రజలు బాధపడుతున్నారు. టీడీపీ […]

తెలంగాణకు నష్టం ఉండకపోవచ్చు

మిడతల దండు 1993 తర్వాత మళ్లీ ఇప్పుడే మహారాష్ట్ర వైపు వచ్చిందని అగ్రికల్చర్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పదోజోన్‌ డైరెక్టర్‌ వైజీ ప్రసాద్‌ బుధవారం తెలిపారు. ఇవి తెలంగాణ సరిహద్దుకు 400 కి.మీ దూరంలో ఉన్నాయని, రాష్ట్రంలోకి వస్తాయా? రావా? అనేది రెం డురోజుల్లో తెలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ప్ర ధాన పంటలన్నీ పొలాల నుంచి ఇండ్లకు చేరటం తో అవివచ్చినా నష్టం ఉండదని వ్యవసాయరంగ నిపుణులు అంచనావేస్తున్నారు. కూరగాయల పం టలు నష్టపోయే ప్రమాదముందని […]

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మొదటి ముస్లిం ప్రచారక్ మృతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మొదటి ముస్లిం ప్రచారక్ మాననీయ గుల్షన్ అబ్దుల్లా షేక్ అలియాస్ ప్రహ్లాద్ షిండే ముంబై సమీపంలోని పాన్వేల్ వద్ద అనారోగ్యంతో మరణించారు..!! వారు విశ్వ హిందూ పరిషత్ (VHP) కొంకణ్ ప్రాంత ధర్మజాగరణ్ బాధ్యతలో ఉన్నారు..!! గుల్షన్ షేక్ గా జన్మించిన షిండే ముంబైలోని తన సొంత పట్టణమైన మాతెరన్ పట్టణంలో ఆర్ఎస్ఎస్ లో చేరారు.!! ఆయన అత్యుత్తమ నిర్వాహకుడు జనసమీకరణలో దిట్ట అయిన శ్రీ షిండే సంఘ కార్యములో చురుకుగా పాల్గొనేవారు..వారి […]

మోదీపై.. మరక మంచిదేనా?

మద్యం మినహాయింపుతో ప్రతిష్ఠ చెరిగిందా? మోదీపై నెపం నెట్టేస్తున్న రాష్ట్రాలు మోదీ చెబితేనే అమ్ముతున్నామన్న ఏపీ మంత్రులు ఎదురుదాడిలో కమలదళాలు విఫలం (మార్తి సుబ్రహ్మణ్యం) కరోనా రక్కసిపై పోరాటంలో ప్రధాని ప్రదర్శించిన మనోనిబ్బరం.. ప్రజలకు ఆయన చేసిన దిశానిర్దేశం.. జాతిని ఒక్కతాటిపై నడిపించిన నాయకత్వ పటిమ.. ఆ మేరకు ప్రజలు కూడా ఆయన వెంట నడిచిన తీరును, ప్రపంచం వేనోళ్లా పొగిడింది. అమెరికా వంటి ప్రపంచ పెద్దన్నే మెడిసిన్ కోసం, మోదీ వద్ద చేయి చాపింది. మోదీ […]

ఒక ట్రంప్..ఇంకో మోదీ.. మరో డబ్ల్యుహెచ్‌ఓ.. జగనన్న ముందు బలాదూర్!

కరోనాతో సహజీవనం చేయక తప్పదట తరిమివేస్తామంటున్న ప్రధాని మోదీ ‘జగన్మోహన సందేశం’తో కళ్లు తెరచుకున్న ప్రపంచం       (మార్తి సుబ్రహ్మణ్యం) ఈ పెద్దోళ్లున్నారే.. మా పిల్లల మనసు అర్ధం చేసుకోరు. ఆ అమెరికా ప్రెసిడెంటు ట్రంప్ ఉన్నాడే.. ఉత్తి పిచ్చోడు. కయ్యి కయ్యిన అరుస్తుంటాడు. కరోనా వైరస్‌పై నానా హంగామా చేస్తున్నాడు. చైనామీద మాటి మాటికీ కళ్లెర్ర చేస్తున్నాడు. మన ప్రధాని మోదీ ఉన్నారే.. పాపం ఆయన కరోనాపై యుద్ధానికి నానా పాట్లు పడుతున్నారు. […]

నిరంతర సేవా స్రవంతి.. కిషన్‌రెడ్డి!

కరోనా కాలంలో నిరంతర సేవలు కంట్రోల్‌రూమ్‌లోనే కిషన్‌రెడ్డి వైఎస్ ఆరోగ్యశ్రీకి కిషన్‌రెడ్డి ధర్నానే ప్రేరణ (మార్తి సుబ్రహ్మణ్యం) గంగాపురం కిషన్‌రెడ్డి.. తొలి ప్రయత్నంలోనే పార్లమెంటు సభ్యుడిగా గెలిచి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేసే అరుదైన అవకాశం దక్కించుకున్న కిషన్‌రెడ్డి.. కరోనా సమయంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరి అభినందలు అందుకుంటున్నాయి. దివంగత  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో కలసి.. చిన్నారులకు గుండె చికిత్సలు ప్రభుత్వమే ఉచితంగా నిర్వహించాలని […]

ఛీ..ఛీ.. వైసీపీతో బీజేపీ లాలూచీ లేదు

ఢిల్లీ బీజేపీ ఒకటి బెజవాడ బీజేపీ వేరు కాదు కిట్ల కోనుగోల్‌మాల్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయండి వైసీపీ సర్కారును ఉపేక్షించవద్దు వైసీపీ-టీడీపీ రెండిటితోనూ సమదూరం అందరి గొంతులూ ఒకేలా ప్రతిధ్వనించాలి కమలనాధులు కన్నాను అనుసరించండి వైసీపీ బంధంపై తేల్చి చెప్పిన కమలదళపతి నద్దా (మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీలో అధికార వైసీపీతో ఉన్న బంధంపై.. ఇప్పటివరకూ అయోమయంలో ఉన్న కమలనాధుల సందేహాలకు, కమలదళపతి నద్దా తెరదించారు. వైసీపీతో ఎలాంటి బాదరాయణ సంబంధాలు లేవని తేల్చారు. తెలుగుదేశంతో ఎంతో దూరంలో […]

కరోనాపై సంఘ్ పరి‘వార్’!

లక్షల్లో సైనికులు, వేలల్లో బృందాలు హెల్ప్‌లైన్‌కు అపూర్వ స్పందన దివిసీమ ఉప్పెన నుంచి కరోనా వరకూ.. (మార్తి సుబ్రహ్మణ్యం) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. ఈ పేరు సేవకు నిలువెత్తు చిరునామా. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తిన ప్రతిసారీ, మేమున్నామంటూ రంగంలోకి దిగి బాధితులకు బాసటగా నిలిచే మహోన్నత మానవీయ సంస్థ. కులం-మతం-ప్రాంతాలకు అతీతంగా బాధితులను పెద్ద మనసుతో హత్తుకుని సేవలందించడంలో దానికదే సాటి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సభ్యులున్న సేవాసంస్థగా పేరున్న ఆర్‌ఎస్‌ఎస్‌కు, సేవాతత్పరత  పుట్టుకతో వచ్చిన లక్షణం. […]

భయపెడుతున్నారా?..భయపడుతున్నారా?

జమాత్‌పై నిషేధం ఏదీ?ఎప్పుడు? దాక్కుంటున్న వారిని బుజ్జగిస్తారేం? కాన్పూర్‌లో పట్టిస్తే పదివేల బహుమానం దాచిపెడితే కర్నాటకలో నేరుగా రిమాండే సంతుష్ఠీకరణ ముందు సహనం తలదించుకుంటోందా?           (మార్తి సుబ్రహ్మణ్యం) మావోయిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకు దేశంలో గానీ, రాష్ట్రాల్లో గానీ ఆఫీసులు ఉండవు. వారివి అన్నీ రహస్య కార్యకలాపాలే. కానీ, తీవ్రవాద విధానాలు అవలంబిస్తూ హత్యలు చేస్తున్నందున, ఆ సంస్థను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. ఇంకా ఈరకంగా విదేశీ సంస్థలతో సంబంధం […]

గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ!

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బాసుల తీరు ఏపీలో పార్టీ దళపతిపై వైసీపీ మాటల దాడులు కన్నా 20 కోట్లకు అమ్ముడుపోయారన్న విజయసాయి సాయిరెడ్డి ఆరోపణలపై స్పందించని జీవీఎల్ ట్రంప్‌తో విందుకు కేసీఆర్‌కు ఆహ్వానం కేసీఆర్ సర్కారుపై కేంద్రమంత్రుల ప్రశంసలు కమలదళాలకు  అర్ధం కాని అవసరార్ధ రాజకీయాలు (మార్తి సుబ్రహ్మణ్యం) కేసీఆర్, జగన్మోహన్‌రెడ్డి.. ఇద్దరూ రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు నాయకత్వం వహిస్తున్న అధినేతలు. ఇద్దరూ ప్రధాని మోదీని ప్రశంసిస్తారు. ఆయనను పల్లెత్తుమాట అనరు. వారికి ఆయన అపాయింట్‌మెంట్ […]

%d bloggers like this: