బహుజనుల ద్రోహి ప్రవీణ్ కుమార్

తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్.ఎస్. ప్రవీణ్‌ కుమార్ కు వ్యతిరేకంగా కొమురం భీమ్ జిల్లాలో గురువారం పోస్టర్లు వెలిశాయి. కౌటాల మండల కేంద్రంలో.. బహుజన ద్రోహి ఆర్.ఎస్. ‘గో బ్యాక్’ అంటూ కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సిర్పూరు నియోజ‌క‌ వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాల‌య్యారు. ఆ త‌ర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో చేరారు.

Read More

భుజంగ రావు, తిరుపతన్న లకు ఐదు రోజుల కస్టడీ

ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో మరికొందరు పోలీసుల అరెస్టు ? తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్న లను ఐదు రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపటి నుంచి ఐదు రోజుల పాటు వారిని పోలీసులు విచారించ నున్నారు. ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. ప్రణీత్‌రావు…

Read More

ఇంట‌ర్ కాలేజీ ల‌కు సెలవులు

హైద‌రాబాద్: తెలంగాణ లోని ఇంట‌ర్ కాలేజీ ల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సెల‌వులు ప్ర‌క‌టించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొన‌సాగ‌ నున్నాయి. మ‌ళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచు కోనున్నాయి. ఈ సెల‌వులు రాష్ట్రం లోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీల‌కు వ‌ర్తించ‌ నున్నాయి. ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌ను ఉల్లంఘించి కాలేజీ ల‌ను నిర్వ‌హించే వారిపై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి…

Read More

బర్రెలక్కకు లగ్గమాయె!

వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క నాగర్ కర్నూల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లో కొల్లాపూర్ నియోజకవ ర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేసి సంచలనం సృష్టించిన బర్రెలక్క పెళ్లి ఘనంగా జరిగింది. తన దగ్గరి బంధువైన వెంకటేష్ అనే అబ్బాయితో బర్రెలక్క (శిరీష) ఇవాళ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read More

ఇందిరమ్మ పాలన అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడమేనా?

– కాంగ్రెస్ పాలనలో హిందువులు బతికే పరిస్థితి లేదు – అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు.. కేసులతో నోరునొక్కడమా? – చెంగిచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్తే కేసులు ఎలా పెడ్తారు? – హిందువులను హింసించి దేశాన్ని నాశనం చేసేవాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలి మాఫియాకు వంతపాడటం ఎంతవరకు సమంజసం? – రాష్ట్ర సర్కారు, పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజం చంగిచర్ల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి…

Read More

పోలీసుల అదుపులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును, గతంలో ఎస్ఐబీలో సీఐగా పని చేసిన గట్టు మల్లును పోలీసులు విచారిస్తున్నారు. వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ విచారిస్తున్నారు. ప్రణీత్ రావుపై కేసు నమోదు కాగానే రాధాకిషన్ రావు అమెరికా వెళ్లిపోయారు. దర్యాఫ్తు బృందం లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. రాధాకిషన్, గట్టు మల్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. వ్యాపారవేత్తలను బెదిరించి…

Read More

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, మార్చి 28: ఉమ్మడి పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి భారీ మెజారీతో విజయం సాధించబోతున్నారని ఎక్సైజ్, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో మంత్రి జూపల్లి కృష్ణారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… గత పదేండ్లలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని, స్థానిక ప్రజాప్రతినిధులు ఆ…

Read More

మల్కాజిగిరిలో మరోసారి ఘన విజయం సాధించాలి

-టిఆర్ఎస్ బిజెపి అడ్రస్ గల్లంతవ్వాలి -సీఎం రేవంత్ రెడ్డి -కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన బీఆర్ఎస్, టిడిపి, పి అర్ పి పార్టీ, కమ్మ సంఘం నేతలు -కాంగ్రెస్ లో చేరిన వారిలో మాజీ టిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ కార్పొరేటర్లు,మాజీ ఎంపీపీలు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు -కండువా కప్పి స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి -పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి హైదరాబాద్ : మల్కాజ్గిరి…

Read More

కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం

-చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుంది.తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నాం.క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉంది.అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్ ని…

Read More

నా ఫోన్ ట్యాపింగ్ చేశారు

-ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీష్, వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి -కొనుగోలు చేసింది ఎవరు? -జడ్జిలు, సినీ నటుల ఫోన్లూ ట్యాపింగ్‌కు గురయ్యాయి -ఏపీలో ప్రతిపక్ష నేతల ఫోన్లపైనా ట్యాపింగ్ పెట్టారు – దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు – డీజీపీకి ఫిర్యాదు – చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళతానని హెచ్చరిక తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది రఘునందన్‌రావు…

Read More