చిరు వ్యాపారుల‌కు అండ‌గా ఉంటా: వైఎస్ ష‌ర్మిల‌

ఎన్నికలు మొద‌ల‌య్యాయంటే… రాజ‌కీయ నేత‌లు లెక్క‌లేన‌న్ని చిత్రాలను చూపిస్తూ ప్ర‌చారం సాగిస్తుంటారు. ఓ నేత బ‌జ్జీలు వేస్తే… ఇంకో నేత దోశెలు వేస్తారు. ఇంకో నేత ఇస్త్రీ చేస్తే… మ‌రో నేత టీ తిర‌గ్గొడుతూ క‌నిపిస్తారు. ఇలా ఎన్నిక‌ల్లో మాత్ర‌మే క‌నిపించే ఈ చిత్రాలు… ఇప్పుడు పాద‌యాత్ర‌ల్లో భాగంగా ఎన్నిక‌లు లేని స‌మ‌యంలోనూ క‌నిపిస్తున్నాయి. ప్ర‌జా ప్రస్థానం యాత్ర పేరిట తెలంగాణ‌లో పాద‌యాత్ర చేస్తున్న వైఎస్సార్టీపీ అధినేత్రి మొక్క‌జొన్న పొత్తులు కాలుస్తూ క‌నిపించారు. ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర‌లో…

Read More

హైద‌రాబాద్ సంస్థానంపై వీడియో విడుద‌ల చేసిన కిష‌న్ రెడ్డి

భార‌త దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత కూడా కొంత కాలం పాటు హైద‌రాబాద్ నిజాం పాల‌న‌లోనే కొన‌సాగిన సంగతి తెలిసిందే. నిజాం పాల‌న నుంచి హైద‌రాబాద్‌కు విముక్తి క‌ల్పించి… హైద‌రాబాద్ సంస్థానాన్ని భార‌త దేశంలో క‌లిపే దిశ‌గా నాటి భార‌త ప్ర‌భుత్వం ప్రత్యేక క‌స‌ర‌త్తు చేసింది. భార‌త తొలి ఉప ప్ర‌ధాని స‌ర్దార్ వ‌ల్ల‌భాయి ప‌టేల్ మంత్రాంగంతో నిజాం న‌వాబు హైద‌రాబాద్ సంస్థానాన్ని భార‌త్‌లో విలీనం చేసేందుకు అంగీక‌రించారు. ఈ అరుదైన ఘ‌ట్టాన్నే ఇప్పుడు కొంద‌రు విలీన…

Read More

నటుడు కృష్ణంరాజు మృతికి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం

ప్రముఖ చలనచిత్ర సీనియర్ నటులు, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం ప్రకటించారు. అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు, లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, దేశ ప్రజలకు సేవలందించారని మంత్రి అన్నారు….

Read More

ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతికి మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ సంతాపం

ప్రముఖ నటుడు, రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు మరణం పట్ల రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా , పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి మరణం తెలుగు సినీ పరిశ్రమకు, రాజకీయ రంగానికి తీరని లోటన్నారు. NTR, ANR, కృష్ణ, శోభన్ బాబు ల సమకాలికులన్నారు. విభిన్న, విలక్షణ పాత్రల ద్వారా తెలుగు చిత్ర సీమలో రెబల్ స్టార్ గా ఎంతోమంది అభిమానుల్ని…

Read More

సినీ హీరో కృష్ణంరాజు మృతి బాధాకరం: వద్దిరాజు రవిచంద్ర

ప్రముఖ సినీహీరో, కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు మృతి తీవ్ర బాధాకరం అని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కృష్ణంరాజు అనేక సినిమాలలో హీరోగా తన విలక్షణమైన నటనాశైలితో ‘రెబల్ స్టార్’ గా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారని, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారని రవిచంద్ర తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. సినిమా హీరోగా,లోక్ సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా తెలుగు చిత్ర పరిశ్రమకు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణంరాజు విశేష…

Read More

ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతికి మంత్రి కిషన్ రెడ్డి సంతాపం

-కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ నటుడు, ‘రెబల్ స్టార్’గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఉప్పలపాటి కృష్ణంరాజు ఇకలేరని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. పాత్రికేయుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి నటుడిగా, బీజేపీ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, పారిశ్రామిక వేత్తగా అవకాశం వచ్చిన ప్రతిచోటా తనదైన ముద్రవేసుకున్న మహనీయుడు కృష్ణంరాజు. నిరంతరం ప్రజల శ్రేయస్సును ఆలోచించిన గొప్ప మనిషి వారు. బీజేపీ…

Read More

నటుడు కృష్ణంరాజు మృతికి బండి సంజయ్ సంతాపం

బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణం రాజు అకాల మరణం బాధాకరం. పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన కృష్ణం రాజు చేసిన సేవలు మరవలేనివి. జర్నలిస్టుగా, ఫొటో గ్రాఫర్ గా, సినీ నటుడిగా, రాజకీయవేత్తగా సేవలందించిన కృష్ణంరాజు సినిమా రంగంలో ఐదు ఫిలింఫేర్, మూడు నంది అవార్డులు గెలుచుకున్న మహా నటుడు. సినీ ప్రేక్షకుల హృదయాల్లో ‘రెబల్ స్టార్’ గా చిరస్థాయిగా అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం…

Read More

నటుడు కృష్ణంరాజు మృతికి డాక్టర్ కె లక్ష్మణ్ సంతాపం

మాజీ కేంద్రమంత్రి, బిజెపి నాయకులు యు.వి.కృష్ణంరాజు నేడు అనారోగ్యంతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించింది. వారితో కలిసి అనేక సంవత్సరాలు పార్టీలో పని చేయడం జరిగింది. మృదుస్వభావి. రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా అనేక సంవత్సరాలు పనిచేసినా, నీతి నిజాయితీతో సమర్థవంతంగా పనిచేశారు. వారి మరణం బిజెపి పార్టీ కి, తెలుగు ప్రజలకు, సినిమా కళాకారులకు తీరని లోటు. కృష్ణంరాజు మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ వారి…

Read More

ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతికి మంత్రి తలసాని సంతాపం

ప్రముఖ చలనచిత్ర నటుడు, మాజీ కేంద్రమంత్రి రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణం రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం ప్రకటించారు.తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో హీరోగా, నటుడిగా వివిధ పాత్రలలో తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్నారు. కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని పేర్కొన్నారు. లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ…

Read More

99 సెకన్ల కథలు ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం…

99 సెకన్ల కథలు…ఈ టైటిల్ వినగానే ఆశ్చర్యంగా..ఆసక్తిగా ఉంది కదూ…అవును.. జస్ట్ 99 సెకన్లలో ఓ కథ చదివేయొచ్చు.. పుస్తకాలు తిరగేయలేక వదిలేసేవారికి…ఈ తరం వారికి…రాబోయే తరం వారికి నీతి కథలు ఎన్నో…మరెన్నో.. ఇలా పుస్తకంలో కథలు రాసింది ఎవరాని ఆలోచిస్తున్నారా…? సాహితీలోకానికి సుపరిచితులు సీనియర్ పాత్రికేయులు, రచయిత జి.వల్లీశ్వర్.. అనువాద రచయితగా ఎన్నో సంచలనమైన కథారచనలతో పుస్తకాలను సాహితీలోకానికి పరిచయం చేసిన వల్లీశ్వర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదేమో. సీనియర్ పాత్రికేయులు, రచయిత…

Read More