Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర ప్రభుత్వ బాదుడే బాదుడుతో ప్రజలు విలవిల్లాడుతున్నారు

– ప్రజలను పీల్చి పిప్పి చేశాలా చార్జీలు, పన్నులు పెంచుతూ జగన్ నిర్ణయాలు
– ఆర్టీసీ చార్జీల పెంపుతో పేద,మధ్యతరగతి వర్గాలపై తీవ్ర భారం
– డీజిల్ సెస్ పేరుతో చేసిన చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
-టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తన అసమర్థ పాలనతో పేదలపై పన్నులు వేస్తూ, చార్జీలు పెంచుతూ ప్రజలను పీక్కుతుంటుందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వారానికో శాఖలో చార్జీలు పెంచడమో…..పన్నులు పెంచడమో ప్రభుత్వానికి అలవాటు గా మారిపోయిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో తాజాగా ఆర్టిసి బస్ టిక్కెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు.

ఇప్పటికే కరెంట్ చార్జీలు, చెత్త పన్నులు, ప్రాపర్టీ టాక్స్ లతో పాటు నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు అల్లాడుతన్నారని అన్నారు. ఇలాంటి సమయంలో పేదలు, మద్య తరగతి ప్రజలు ఎక్కవగా వినియోగించే ప్రజా రవాణా ఆర్టీసీ లో చార్జీలు పెంచడం వారిపై తీవ్ర భారం మోపినట్లు అవుతుందని అన్నారు. ప్రభుత్వం బాదుడే బాదుడు కార్యక్రమం లో రాష్ట్రాన్ని, ప్రజలను ఎటుతీసుకువెళుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.

పల్లెవెలుగు సహా అన్ని రకాల బస్సు సర్వీసులపై పెంపును చంద్రబాబు ఖండించారు. వైసిపి అధికారం లోకి వచ్చిన తరువాత రెండో సారి ఆర్టిసి చార్జీలు పెంచారని అన్నారు. ప్రభుత్వంలో ఆర్టిసి విలీనం తరవాత సంస్థకు అండగా నిలవాల్సింది ప్రభుత్వమేనని చంద్రబాబు అన్నారు. చార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE