కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల అక్రమాలపై ఎన్నికల కమీషనర్ కు బాబు లేఖ

అభ్యర్ధులు నామినేషన్లు సాయంత్రం 3 గంటలకు ఉపసంహరించుకున్న తర్వాత పోటీ చేసే అభ్యర్ధుల పైనల్ లిస్ట్ ప్రకటించడం లేదు.అభ్యర్ధుల ఫైనల్ జాబితాను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటీ?దొంగ సంతకాలతో టిడిపి అభ్యర్ధులను పోటీ నుంచి తప్పించేందుకు ఫైనల్ లిస్ట్ ను ప్రకటించడం లేదు.
2020, 2021 మార్చిలో చేసిన మాదిరే ఇప్పుడూ ఎన్నికల ప్రక్రియను అడ్డుకుని అవకతవకలకు పాల్పడుతున్నారు. మార్చిలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ప్రతిపక్ష అభ్యర్ధుల నామినేషన్లను దొంగ సంతకాలతో తొలగించి అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకుంది. స్థానిక ఎన్నికల అధికారులు అధికారపార్టీతో కుమ్మక్కై ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఇప్పటికీ నెల్లూరు మునిసిఫల్ కార్పొరేషన్ అభ్యర్ధుల ఫైనల్ జాబితాను ప్రకటించలేదు. ఇప్పటి వరకు కుప్పం మునిసిఫల్ వార్డు నంబర్లు 13, 14, 15 లను అక్రమంగా ఏకగ్రీవం చేసుకున్నారు. అక్రమంగా కైవసం చేసుకున్న 13, 14, 15 వార్డుల ఫలితాలను నిలుపుదల చేసి వాటి విచారణ చేపట్టండి. శాంతియుత వాతావరణంలో నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించేందుకు తక్షణమే తగిన చర్యలు తీసుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.