రాజేంద్రప్రసాద్‌కు బాబు పరామర్శ

విజయవాడ రమేష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్‌ను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు పరామర్శించారు. ఆయన కుటుంబసభ్యుల యోగక్షేమాలు విచారించారు, వైద్యులను అడిగి రాజేందప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి వాకబు చేశారు. త్వరగా కోలుకుని, తిరిగి ప్రజాక్షేత్రంలో నిలవాలని బాబు ఆకాంక్షించారు.