రాజకీయ కురువృద్ధుడు యడ్లపాటి మృతికి చంద్రబాబు సంతాపం

అమరావతి: రాజకీయ కురువృద్దులు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు మృతికి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన యడ్లపాటి రాజకీయ జీవితం ఎంతో ఆదర్శ ప్రాయంగా సాగిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర మంత్రిగా, జడ్పి చైర్మన్ గా, రాజ్యసభ సభ్యునిగా పని చేసిన యడ్లపాటి…తాను చేపట్టిన పదవులకు వన్నెతెచ్చారని అన్నారు. యడ్లపాటి జీవితం ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని టిడిపి అధినేత అభిప్రాయ పడ్డారు. యడ్లపాటితో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా యడ్లపాటి ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. యడ్లపాటి కుంటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలియజేశారు. వెంకట్రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.