విజయరామారావు మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం

16

అమరావతి:- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రిగా పనిచేసిన కె.విజయరామారావు మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సిబిఐ డైరెక్టర్ గా, మంత్రిగా విజయ రామారావు విశేష సేవలు అందించారని కొనియాడారు. విజయ రామారావు కుటుంబ సభ్యులకు చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

నారా లోకేష్ సంతాపం
మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ కె.విజయరామారావు మృతి పట్ల సంతాపం. ఉన్నతాధికారిగా, తెలుగుదేశం పార్టీ నేతగా, మంత్రిగా విజయరామారావు సేవలు చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.

నిజాయితీ, నిబద్దత గల నేత విజయరామారావు : – తెలంగాణ టీడీపీ నేతల సంతాపం
కె.విజయరామారావు మృతి చాలా బాధాకరమని తెలంగాణ టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. విజయరామారావు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సమయంలో, నగరాభివృద్ధికి విశేష కృషి చేశారని నివాళులర్పించారు. సిబిఐ డైరెక్టర్ గా, టీడీపీ పార్టీ మాజీ మంత్రిగా, శాసనసభ్యులుగా విజయ రామారావు విశేష సేవలు అందించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించేవారు. విజయ రామారావు మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రధానంగా నగరంలో ప్రభుత్వ ఆస్తులు కాపాడటంలో ఆయన కృషి ఎనలేనిదని.. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవిందకుమార్ గౌడ్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల కిశోర్, సనత్‌నగర్ టీడీపీ నేత మండూరి సాంబశివరావు, రాష్ట్ర మహిళా నేత షకీలారెడ్డి, లత తదితరులు నివాళులర్పించారు.