Advertisements

టిడిపి సీనియర్ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

పాల్గొన్న రెండు రాష్ట్రల , జిల్లా, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు.

కరోనా మహమ్మారి కనీవినీ ఎరుగని విపత్తు: చంద్రబాబు.
ప్రపంచవ్యాప్తంగా 6లక్షల కేసులు దాటాయి.
యూరప్, అమెరికా దేశాల్లో కరోనా కేసులు 120%- 300% పెరిగాయి
ఆర్ధిక వ్యవస్థ తలకిందులయ్యే పరిస్థితి.
కోట్లాదిమందికి ఉపాధి పోయే ప్రమాదం ఏర్పడింది.
కరోనా రోగి బైట తిరిగితే 6రోజుల్లో 3,200మందికి వస్తుంది.
చైనాలోని వుహాన్ గవర్నర్ చెప్పిన మాట ఇది.
కేవలం 3నెలల్లోనే 196దేశాలకు విస్తరించింది.
కరోనాను ఎవరూ తేలిగ్గా తీసుకోరాదు.
దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి 2వ దశకు చేరింది.
అన్ని ప్రార్ధనాలయాలను మూసేయడం గతంలో లేదు.
ఒక ప్రాంతానికే పరిమితమైన విపత్తు కాదిది..యావత్ ప్రపంచాన్నే కరోనా గడగడలాడిస్తోంది.
దక్షిణ కొరియాలో 4టి విధానంతో సత్ఫలితాలు. ట్రేస్, ట్రాక్, టెస్ట్, ట్రీట్ ద్వారా కరోనా కట్టడి.
చైనాలో 10రోజుల్లోనే 1,000పడకల ఆసుపత్రి నిర్మించారు. తైవాన్, సింగపూర్ లో మెరుగైన విధానాల అమలు.
ఇతర దేశాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ అధ్యయనం చేయాలి. ఎప్పటికప్పుడు వాటిని విశ్లేషించాలి, మెరుగుపరిచి రాష్ట్రంలో అమలు చేయాలి.
కరోనా వైరస్ టెస్టింగ్ ల సామర్ధ్యాన్ని పెంచుకోవాలి. దక్షిణ కొరియాలో వారానికి 4లక్షల పరీక్షలు.

టెక్నాలజి సద్వినియోగంతో కొన్నిదేశాల్లో కట్టడి చేశారు. కట్టడి చేసిన దేశాల్లో కరోనా మరణాలు తగ్గాయి.
మన ఆర్టీజిని సద్వినియోగం చేసుకుంటే బాగుండేది.
హుద్ హుద్, తిత్లీలో టెక్నాలజి వినియోగపడింది. అందుకే ఆంధ్రప్రదేశ్ లో రియల్ టైమ గవర్నెన్స్(ఆర్టీజి) అభివృద్ది చేశాం.
సక్రమంగా వినియోగించుకుంటేనే వ్యవస్థలకు సార్ధకత.
గత 2నెలల్లో విదేశాలనుంచి 15లక్షల మంది వచ్చారు. కేంద్రం లెక్కలకు, రాష్ట్ర ప్రభుత్వ లెక్కలకు భారీ అంతరం. కేంద్ర కేబినెట్ కార్యదర్శి తెలియజేశారు.
విదేశాలనుంచి వచ్చినవారి గుర్తింపునకు ఆర్టీజి దోహదపడేది.

ఈ పరిస్థితుల్లో మన మెడ్ టెక్ పార్క్ ఎంతో ఉపయోగకరం. విశాఖ నుంచే మెడికల్ ఎక్విప్ మెంట్ దేశానికే సరఫరా అయ్యేది.
మెడ్ టెక్ పార్క్ సద్వినియోగం చేసుకుంటే బాగుండేది.
విమర్శలు చేయవద్దు, సలహాలు సూచనలు ఇవ్వాలి.

ప్రజల పట్ల పోలీసులు పూర్తి నిగ్రహం పాటించాలి. అన్నివర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి. అందరూ సమన్వయంగా పనిచేయాలి.
సమస్యను పరిష్కరించాలే తప్ప జఠిలం చేయరాదు.
కొన్నిచోట్ల రోడ్లకు అడ్డంగా తాళ్లు కట్టడంతో ప్రమాదాలు. తాళ్లు తగిలి కిందపడి కొందరు మరణించారు. వీటన్నింటి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి.
రాష్ట్రంలోకి వచ్చేందుకు సరిహద్దుల్లో వేలాదిమంది. ఒకేచోట గుంపులుగా చేరితే కరోనా పెనుముప్పు. ఎక్కడికక్కడ భౌతిక దూరం పాటించాలి. బైటనుంచి తెచ్చే నిత్యావసరాలను శానిటైజ్ చేయాలి.

ఉపాధి కోల్పోయిన చేతివృత్తులవారిని ప్రభుత్వమే ఆదుకోవాలి. భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉండాలి.
నిత్యావసరాలను వైరస్ ప్రభావం లేకుండా పకడ్బందీగా ప్యాక్ చేయాలి. ఇంటింటికీ డోర్ డెలివరీ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. పంపిణీ చేసేవారు మాస్క్ లు, గ్లోవ్స్ ధరించాలి. మొబైల్ రైతుబజార్లతో కూరగాయలు అందజేయాలి. ఫ్రంట్ లైన్ వారియర్ల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.

నకిలీ శానిటైజర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
అందరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. సాటివారిలో ధైర్యం నింపాలి, విశ్వాసం పెంచాలి.
మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి. తద్వారా ఇరుగు, పొరుగు ఆరోగ్యం కాపాడాలి. ఏం చేయాలో, ఏం చేయకూడదో అవగాహన ఉండాలి. తద్వారా కుటుంబ ఆరోగ్యం, సమాజ ఆరోగ్యం కాపాడాలి.

Leave a Reply

%d bloggers like this: