Suryaa.co.in

Andhra Pradesh

బాబు కంటికి శస్త్రచికిత్స

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. గత కొంతకాలం నుంచి ఆయన కంటి నొప్పితో బాధపడుతుండగా, గతంలో ఒక కంటికి మాత్రమే శస్త్రచికిత్స చేశారు. తాజాగా ఆయన రెండో కంటికి సైతం, క్యాటరాక్ట్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఆ సందర్భంగా వైద్యులు, చంద్రబాబుతో కలసి గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం ఆయన తన నివాసానికి వెళ్లిపోయారు.

LEAVE A RESPONSE