– ట్విట్టర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు
లోన్ యాప్‌ల వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్య ఘటన మరువకముందే ఈరోజు పల్నాడులో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముఖ్యంగా మహిళల గౌరవాన్ని బజారుకీడుస్తూ వేధిస్తున్న ఇలాంటి లోన్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అంతేకానీ చావు పరిష్కారం కాదు. ప్రభుత్వం, పోలీసులు కూడా ఇటువంటి యాప్ ల గురించి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి. బాధితులకు అండగా నిలిచి మనోధైర్యాన్ని ఇవ్వాలి.