Suryaa.co.in

Andhra Pradesh

దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

అమరావతి : తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ బోల్తా కొట్టిన ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని సిఎం అన్నారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యంపై సిఎం ఆరా తీశారు. మంచి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జీడిపిక్కల లోడ్‍తో లారీ వెళుతుండగా అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం అన్నారు.

LEAVE A RESPONSE