రైతు బజార్ ఏర్పాటుతో దళారి వ్యవస్థకు చెక్

– రైతులు, కొనుగోలుదారులకు లాభదాయకంగా ఉండేలా వైఎస్ఆర్ రైతు బజార్…
– రూ 1 కోటితో నిర్మించిన వైఎస్ఆర్ రైతు బజార్ ప్రారంభోత్సవంలో ఎంపి మిథున్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎం ఎల్ ఏ మోహన్ రెడ్డిలు

రైతులకు, వినియోగ దారుల మధ్య దళారి వ్యవస్థను రూపుమాప డానికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ రైతు బజారులను ఏర్పాటు చేస్తోందని ఎంపీ పి.వి.మిథున్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి లు అభిప్రాయ పడ్డారు. రాయచోటి పట్టణ నడిబొడ్డున రూ.కోటి రూపాయలతో నిర్మించిన రైతు బజారును మాజీ ఎం ఎల్ ఏ మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి లతో కలిసి వారు సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎం పి మిథున్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి రైతులు పండించిన కూరగాయలు, ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి ఒక కోటి రూపాయల నిధులను మంజూరు చేయించి రైతు బజార్ ను ఏర్పాటు చేయించడం అభినందనీయ మన్నారు. నియోజక వర్గ పరిధిలోని అర్హత కలిగి కూరగాయలు, పంటలు పండించుకుని విక్రయించుకునే రైతులకు రైతు బజార్ మంచి వ్యాపార కేంద్రంగా మారనుందన్నారు.

చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన కూరగాయలు, పంటలకు కమీషన్లు లేకుండా విక్రయించుకునే అవకాశం కలుగుతుందన్నారు. కొనుగోలు దారులు కూడా రైతులు పండించి, విక్రయించే తాజా కూరగాయలు సరసమైన ధరలకు లభిస్తాయన్నారు. మార్కెట్ యార్డ్ అధికారులు అనునిత్యం ఈ బజారును పర్యవేక్షిస్తూ ఒక మోడల్ రైతు బజార్ గా తీర్చిదిద్దాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ అన్వర్ బాషా కు సూచించారు.

ప్రకృతి వ్యవసాయ పంట నమూనా పరిశీలన
రైతు బజార్ లో ప్రకృతి వ్యవసాయ శాఖ వారు రూపొందించిన పంట నమూనాను ఎంపి మిథున్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి లు పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులును చైతన్యవంతుల్ని చేయాలని అధికారులును వారు ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన కూరగాయలు, పండ్లు ను రైతు బజార్ లో పెట్టించాలని ఎంపి, చీఫ్ విప్ లు ఆదేశించారు.

మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ భాస్కర్, జెడ్ పి టి సి లు వెంకటేశ్వర రెడ్డి,మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, జల్లా సుదర్శన్ రెడ్డి,మాసన వెంకట రమణ, యదుభూషన్ రెడ్డి, సర్పంచుల సంఘ అధ్యక్షుడు చిదంబర్ రెడ్డి, వ్యవసాయ సలహామండలి జిల్లా సభ్యులు దిన్నెపాడు రవిరాజు,మాజీ జెడ్ పి టి సి గొర్ల ఉపేంద్రా రెడ్డి,ఏ పి ఎం ఐ డి సి డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి, మండల బిసి నాయకుడు పల్లపు రమేష్,డిసిసిబి డైరెక్టర్ సేఠ్ వెంకట్రామిరెడ్డి, నియోజకవర్గ బిసి సెల్ కన్వీనర్ నాగరాజు యాదవ్ , శివశంకర్ యాదవ్, బేపారి మహమ్మద్ ఖాన్, రామాపురం మాజీ ఎంపిపి గడికోట జనార్షన్ రెడ్డి, వైస్ ఎంపిపి రవిశంకర్ రెడ్డి, సయ్యద్ అమీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply