Suryaa.co.in

Andhra Pradesh

నిరంతర సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఎమ్మెల్యే బోనెలవిజయ్ చంద్ర

నిరంతరం సేవ చేయడం అంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అత్యంత ఇష్టమని కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఆశయంతో పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. విజయవాడ క్షత్రియ ఎంటర్ ఫైనీయర్స్ ఫెడరేషన్ వారి సహకారంతో క్షత్రియ యువజన సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో వరద బాధితులకు నిత్యవసర సరుకుల కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వరదలు వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కష్టపడుతూ బాధితులకు అండగా నిలిచారని అన్నారు. తాగునీరు వైద్యం, ఆహారం, నిత్యవసర సరుకులు పారిశుద్ధ్యం పనులు తదితర అన్నింటిని పర్యవేక్షిస్తూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉందిన్న భరోసా కల్పించి త్వరగా కోలుకొనేలా చేశారని ఎమ్మెల్యే అన్నారు. ఏడుపదుల వయసులోనూ రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ఆయన చేస్తున్న కృషి అందరికీ ఆదర్శం అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE