ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి

ఎమ్మెల్సీ యండి.కరీమున్నీసా భౌతిక కాయానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేను నిర్వహించిన ముఖ్యమంత్రి నేరుగా విజయవాడ,సింగ్ నగర్ ఫ్లై ఓవర్ సమీపంలో ని ఎమ్మెల్సీ కరీమున్నీసా నివాసానికి చేరుకున్నారు .కరీ మున్నీసా భౌతికకాయనికి పూల మాలవేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు . ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాసరావు, యంపీ నందిగం సురేష్,ఎమ్మెల్యే లు మల్లాది విష్ణు, యం.జగన్మోహన్ రావు,జిల్లా కలెక్టర్ జె. నివాస్,సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్,వైఎస్ ఆర్ సిపి నాయకులు దేవినేని ఆవినాష్ తదితరులు ఉన్నారు