Suryaa.co.in

Andhra Pradesh

తాడేపల్లి పెద్దల చేతిలో పావుగా మారిన సీఐడీ

– స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో జరిగింది అంటున్న అవినీతి ముఖ్యమంత్రి వికృత ఆలోచనలు, వినాశన బుద్ధులనుంచి పుట్టిందే. డిజైన్ టెక్, సిమెన్స్ సంస్థలు ఎలాంటి అవినీతికి పాల్పడకపోయినా, అవినీతి చేసినట్లు ఒప్పుకోమని ప్రభుత్వం ఒత్తిడిచేస్తోంది.
• పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు, అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డికి అందరూ అవినీతిపరుల్లానే కనిపిస్తున్నారు.
• చంద్రబాబునాయుడి హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో 2.50లక్షలమంది శిక్షణపొందారు. 75వేలమందికి ఉపాధి లభించింది.
• తాడేపల్లి పెద్దల చేతిలో పావుగా మారిన సీఐడీ, అసలు వాస్తవాలు దాచేసి, అమాయకుల్ని వేధిస్తోంది.
• ఘంటాసుబ్బారావు, లక్ష్మీనారాయణ సహా, ఇతరుల్ని నిత్యం చంద్రబాబు పేరు చెప్పాలంటూ హింసిస్తున్నారు.
– మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు, అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డికి అందరూ అవినీతిపరుల్లానే కనిపిస్తున్నారని, తానుచేసిన అవినీతితాలూకా కేసులవిచారణ తుదిదశకు చేరుకుంటున్నతరుణంలో, వివేకాహత్యకేసు ఉదంతంనుంచి ప్రజలదృష్టి మళ్లించే క్రమంలో తనపాలనావైఫల్యాలు, అవినీతి వారికి తెలియకూడదన్న సంకుచిత మనస్తత్వంతో ముఖ్యమంత్రి అనేకవ్యయప్రయాసలు పడుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి వర్యులు కొల్లురవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

రాష్ట్రంలోని లక్షలాదిమంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న బృహత్తర లక్ష్యంతో, పవిత్రమైన ఆశయంతో గతప్రభుత్వంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు శ్రీకారం చుట్టడం జరిగింది. యువతీయువకులు, నిరుద్యోగుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, వారికి మంచిభవిష్యత్ కల్పించే గొప్ప ప్రాజెక్ట్ గా దాన్ని చంద్రబాబునాయుడు గారు తీర్చి దిద్దారు. అలాంటిప్రాజెక్ట్ ను ఈ ముఖ్యమంత్రి నిర్వీర్యం చేయడమే గాక, దానిలో ఏదో జరిగిం దని దుష్ప్రచారంచేస్తున్నాడు.

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రారంభించిన టీడీపీ ప్రభుత్వం సిమెన్స్ సంస్థ భాగస్వామ్యంతో, రాష్ట్రంలో యువతీయువకులకు మెరుగైన శిక్షణా కార్యక్రమాలు అందేలా చూసింది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో ఐఏఎస్ అధికారులను కూడా డైరెక్టర్లుగా భాగస్వాములను చేయడంజరిగింది. ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 10శాతం నిధులిస్తే, మిగిలిన 90శాతం నిధులను సిమెన్స్ వారు ఇచ్చేలా ఒప్పం దం చేసుకోవడం జరిగింది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో 6క్లస్టర్లను, 34 స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటుచేసి, ఏటా లక్షమంది యువతకు ఉపాధికల్పించే కార్యక్ర మాన్ని దిగ్విజయంగా అమలుచేయడం జరిగింది.

అలాంటి ప్రాజెక్ట్ లో రూ.250కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు ఆరోపణలుచేస్తున్న ముఖ్యమంత్రి , సీఐడీ విచారణపేరుతో కావాలనే కొందరువ్యక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమల్లో భాగంగా ఒక ట్రైపాట్ (త్రైపాక్షిక) అగ్రిమెంట్ జరిగింది. సిమెన్స్ సంస్థకు, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ విభాగానికి, డిజైన్ టెక్ సంస్థకు మధ్యన ఆ ఒప్పందం జరిగింది. సదరు ఒప్పందం ప్రకారం స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాల్లో డిజైన్ టెక్ సంస్థవారు, అన్నిరకాల పరికరాలు, ఇతరత్రా సాఫ్ట్ వేర్ వంటివి ఏర్పాటుచేశారు. నిధులను సక్రమంగా శిక్షణాకేంద్రాల కు, నిరుద్యోగ యువతభవిష్యత్ కు ఉపయోగిస్తే, సూట్ కేస్ కంపెనీలు పెట్టారని, నిధులు దారిమళ్లించారని ఈ ముఖ్యమంత్రి ఏవేవో చెబుతున్నాడు. డిజైన్ టెక్, సిమెన్స్ సంస్థలవారు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతికి పాల్పడపోయినా, అవినీతిచేసినట్లు ఒప్పుకోమని ఈప్రభుత్వం వేధిస్తోంది.

పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీవారు వారికి భారంగా మారిన జీఎస్టీచెల్లింపులను తగ్గించిచూపడంకోసం వాళ్లేదో షెల్ కంపెనీలద్వారా నిధులను డైవర్ట్ చేసుకుంటే, దానికి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధం ఏమిటి? కేవలం రూ.7కోట్లను మాత్రమే డైవర్ట్ చేయడంకోసం షెల్ కంపెనీద్వారా నిధులు దారిమళ్లించారని, దానికి సంబంధించి కేస్ ఫైల్ అయితే, వారే దాన్ని సరిదిద్దుకు న్నారని ఆ కంపెనీవారే స్పష్టంగా చెప్పారు. దాన్నిబూచిగా చూపిన జగన్ ప్రభుత్వం డిజైన్ టెక్ సంస్థ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు ఎలాంటి పరికరాలు సరఫరాచేయలేదని, నిధుల ను గతప్రభుత్వందోచిపెట్టిందని నానాయాగీ చేస్తోంది.

ఆఖరికి సీఐడీ రిమాండ్ రిపోర్ట్ లో డిజైన్ టెక్ సంస్థ స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణాకేంద్రాలకు ఎలాంటి పరికరాలు సరఫరా చేయ లేదని చెప్పడం సిగ్గుచేటు. గతంలోనే కేంద్రప్రభుత్వరంగం సంస్థ అయిన సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) వారు 05-12-2015న క్రాస్ వెరిఫికేషన్ చేసి ప్రాజెక్ట్ వాల్యూయేషన్ మొత్తం కరెక్టేనని తేల్చిచెప్పారు. వారు ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసిమరీ ఈ ప్రభుత్వం తనచేతిలో ఉన్న సీఐడీవారితో వాల్యూయేషన్ సరిగాలేదని, పరికరాలు డిజైన్ టెక్ వారు శిక్షణాకేంద్రాలకు సరఫరాచేయలేదని ఎలా చెప్పిస్తుంది?

దానికి ఫలానా వ్యక్తులు బాధ్యులని ఈప్రభుత్వం ఎలా చెబుతుంది? ఆనాడు ట్రైపాట్ అగ్రిమెంట్ లో సంతకం పెట్టిన వ్యక్తి ఐఏఎస్ అధికారిగా ఇప్పటికీ ఈప్రభుత్వంలో కొనసాగుతున్నది బ్రహ్మనందరెడ్డి. ఎక్కడైనా ఏదైనా తేడాజరిగితే ఆయన బాధ్యత వహించాలా…లేక కేవలం డైరెక్టర్ గా ఉన్న ఘంటా సుబ్బారావుగారు బాధ్యతవహించాలా?

తాడేపల్లి పెద్దలు చెప్పిన విధంగానే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ వ్యవహారంలో సీఐడీ వ్యవహరించిందని తేటతెల్లమవుతోంది. ఆనాడు టీడీపీప్రభుత్వంలో ఏర్పాటైన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఐఏఎస్ అధికారులు ప్రేమచంద్రారెడ్డి, అజయ్ జైన్, ఎస్.ఎస్.రావత్, ఎమ్.రవిచంద్రారెడ్డి, ఉదయలక్మీ, ఘంటాసుబ్బారావు, సచిన్ చౌగిల్ తదితరు లు ఉన్నారు. వారంతా కమిటీలో ఉంటే, ఘంటాసుబ్బారావు, లక్ష్మీనారాయణ గారినే ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నిస్తున్నాం.

ఆనాటి మానిటరింగ్ కమిటీతో పాటు, సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉన్న అజయ్ జైన్, ఎస్.ఎస్.రావత్, బ్రహ్మనందరెడ్డిలు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నారు. వారెవరనీ ప్రశ్నించకుండా, ఈప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ వ్యవహారంలో కేవలం సుబ్బారావు, లక్ష్మీనారాయణ గార్లనే లక్ష్యంగాచేసుకోవడం ఏమిటి? స్కిల్ డెవలప్ మెంట్ లో లేని అవినీతిని, తప్పుడుకేసుని

సృష్టించేక్రమంలోనే ఇప్పుడు ఆప్రాజెక్ట్ ఛైర్మన్ గాఉన్నవ్యక్తే గతఏడాది సెప్టెంబర్ 7న డీజీపీకి ఫిర్యాదుచేశారు. ఆ తరువాత సీఐడీవిచారణకు ఆదేశిం చారు. రాష్ట్రవ్యాప్తంగాఉన్న స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో అన్నిరకాల పరికరాలు, సాఫ్ట్ వేర్ ఉన్నాయని స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తనిఖీలు చేసి, వాటిని స్వాధీనం చేసుకుంటే, తిరిగి సెప్టెంబర్ లో పరికరాలు ఏవీలేవని తప్పుడుఫిర్యాదులు ఎలాఇస్తారు?
ఆఖరికి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ శిక్షణాకేంద్రం సహా, రాష్ట్రంలోని 40కేంద్రాల్లో పరికరాలు ఉన్నట్లు రూఢీచేశారు. సీఐడీ మీచేతిలో ఉందని ఇష్టమొచ్చినట్టు తప్పుడు ఆరోపణలుచేసి, అవినీతి బురద జల్లాలనిచూస్తారా?

ఘంటాసుబ్బారావు గారు ఎలాంటివ్యక్తో ప్రపంచమంతా తెలుసు. 1985లోనే ఆయన ఐటీ సబ్జెక్ట్ లో పీహెచ్ డీ చేశారు. ఆయనలోని నైపుణ్యాన్ని తెలివితేటలను గమనించే చంద్రబాబు గారు ఉమ్మడిరాష్ట్రంలో ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఐటీవిభాగానికి సలహాదారుగా నియమించారు. తరువాత రాజశేఖర్ రెడ్డిగారు కూడా ఘంటాసుబ్బారావుగారిని కొనసాగించడమేకాకుండా ఆయనసేవలకు మెచ్చి 2007 లో సన్మానించారు. అలాంటి వ్యక్తి తప్పుచేసిన వ్యక్తిలా ఈ ముఖ్యమంత్రికి కనిపిస్తున్నాడా? ఆయన్ని జైలుకు పంపించి ఈ ముఖ్యమంత్రి రాక్షసానందం పొందుతున్నాడు.

టీడీపీప్రభుత్వంలో ప్రారంభమై, దిగ్విజయంగా అమలైన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా 2.50లక్షలమంది శిక్షణపొందారు. దాదాపు 75వేలమందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఇప్పుడు అనంతపురంలో ఉన్న కియాపరిశ్రమలో పనిచేసేవారు కూడా శిక్షణ పొందారు. అలాంటి గొప్పప్రాజెక్ట్ ను ఈ ముఖ్యమంత్రి సర్వనాశనంచేసిందికాక, ప్రముఖ కంపెనీలను రాష్ట్రం నుంచి పారిపోయేలా చేశాడు. అలా వెళ్లిపోయిన సంస్థలే లులూ గ్రూప్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కియా అనుబంధవిభాగాల పరిశ్రమలు. కేవలం రాజకీయంగా ప్రతిపక్ష తెలుగుదేశాన్ని లేకుండా చేయాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందనిచెప్పి అరెస్ట్ చేసినవారందరినీ చంద్రబాబునాయుడి గారి పేరుచెప్పాలని నిత్యం వేధిస్తున్నారు. ఈ ముఖ్య మంత్రి తక్షణమే తన వికృతపోకడలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ ఆదాయంతోపాటు తెలంగాణరాష్ట్రసంపద పెరుగుతుందంటే, అక్కడ ప్రభుత్వాలు, ముఖ్యమం త్రులు మారినా అభివృద్ధిని కొనసాగించబట్టే. ముఖ్యమంత్రి చేస్తున్న తప్పుడు ఆ లోచనలతో ఎప్పటికైనా సరే ఆయన ఇబ్బందులు పడకతప్పదు.

LEAVE A RESPONSE