– విలేఖర్ల సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ విలేఖర్లతో మాట్లాడారు. మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్ మాట్లాడుతూ…. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. జడ్జిల బాధలు ఆ సీట్లలో కూర్చుంటే తెలుస్తాయని ఆయన అన్నారు.
సుప్రీం కోర్టు బెంచీలు దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఉండాలని ఎప్పట్నుంచో డిమాండ్ ఉంది. లా కమిషన్, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ కూడా ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై లేదా హైదరాబాద్ లో సుప్రీం కోర్టు బెంచ్ లు పెట్టాలని సూచించాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా ఉన్నా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికే రాజ్యాంగం ఆర్టికల్ 130 కే బెంచ్ లు ఏర్పాటు చేసే అధికారం ఉంది. నాలుగు చోట్ల సుప్రీం బెంచ్ లు ఏర్పాటు చేయడం దేశ సమగ్రత కు భంగం వాటిల్లుతుందని కొందరు అనవసర వాదన లేవనెట్టుతున్నారు. నేను 2015 లోనే ఎంపీ గా సుప్రీం బెంచ్ లు ఏర్పాటు ఆవశ్యకత ఉందని పార్లమెంటు లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదించాను.
దేశంలో 5 .1కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 20 లక్షల కేసులు 30 యేండ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. సుప్రీం కోర్టు కు 34 మంది జడ్జీ లే ఉన్నారు ..64 మంది ఉంటే తప్పేమిటి ?. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 24 మంది జడ్జిలే ఉండేవారు. కేసీఆర్ చొరవతో 2018 లో 42 మంది జడ్జి లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో అప్పటి సీజే ఎన్ వి రమణ చొరవ కూడా ఉంది. ఏపీ హై కోర్టు లో 37 మంది జడ్జి లే ఉన్నారు.
ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయి. సుప్రీం బెంచ్ లు నాలుగు చోట్ల ఏర్పాటు చేయడం తో పాటు సుప్రీం కోర్టు జడ్జి ల సంఖ్యను 64 కు పెంచాలి. ఫుల్ కోర్టు న్యాయవాదులు సుప్రీం బెంచీల ఏర్పాటు ను రకరకాల కారణాలతో వ్యతిరేకిస్తున్నారు. ఫుల్ కోర్టు తన వైఖరి మార్చుకుని సుప్రీం బెంచీల ఏర్పాటు చేసేందుకు ,జడ్జీల సంఖ్య పెంచేందుకు చొరవ చూపాలి.
బీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచం లో భారత్ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం గా ఉంది. న్యాయవ్యవస్థ లో కేసుల పరిష్కారం వారీగా చూస్తే 142 దేశాల్లో 93 వ స్థానం లో ఉంది. సుప్రీం కోర్టు బెంచీల ఏర్పాటు విషయం లో ఫుల్ కోర్టు వాదన సమంజసంగా లేదు. సులు పెండింగ్ లో ఉంటే అది దేశ జీడీపీ పై ప్రభావం చూపుతుంది అని అన్నారు.
న్యాయ వ్వవస్థ కు కేంద్ర బడ్జెట్ లో 0 .1 శాతం నిధులే కేటాయించారు .ఇది ఏ మూలకు సరిపోదు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వం హాయం లో 33 జిల్లాలు ఏర్పాటు చేసి అంతటా కోర్టులు ఏర్పాటు చేసింది ..కోర్టులను కంప్యూటీరకరించింది. ఇది చాలా రాష్ట్రాల్లో లేదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సుప్రీం కొత్త బెంచీలు ఎర్పాటు చేయాలి జడ్జీల సంఖ్య పెంచాలి అని అన్నారు.