విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. సీజేఐ దంపతులకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ సంప్రదాయ వస్ర్తధారణలో ఇంద్రకీలాద్రికి వచ్చారు. తలకు పరివేష్ఠం కట్టుకుని ఆయన దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం సీజేఐ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి పేర్ని నాని, ఎంపీ కేశినేని నాని, దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరి జవహర్‌లాల్, కలెక్టర్ నివాస్, పాలకమండలి ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ.. సీజేఐకి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.