Suryaa.co.in

Andhra Pradesh

అర్జీదారులకు సీఎం చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుల భరోసా

• ప్రతి అర్జీ పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
• జిల్లాలు, నియోజకవర్గాల్లోనే ఫిర్యాధులు స్వీకరించి సమస్యలు పరిష్కరించేలా చర్యలు

మంగళగిరి: టీడీపీ ప్రధాన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీ దారుల నుండి వినతులు స్వీకరించారు. సీఎం స్వయంగా అర్జీలు స్వీకరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుండి పెద్దఎత్తున్న వినతిదారులు తరలివచ్చి సీఎంకు స్వయంగా అర్జీలను అందించారు.

సీఎం ముందు నేరుగా తమ గోడును చెప్పుకుని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అర్జీదారులకు చంద్రబాబు భరోసా కల్పిస్తూ వినతులన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ సమస్యపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని… రెవెన్యూ సమస్యలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మండలం ప్రతి ఊరిలో భూ కుంభకోణం బయట పడుతోందన్నారు. రీసర్వే అస్తవ్యస్తంగా చేసి రికార్డులను తారుమారు చేసి ప్రజలు సమస్యల్లోకి నెట్టారన్నారు.

ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామన్నారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేయడం వలనే నేడు భూ సమస్యలతో బాధితులు పెద్ద ఎత్తున అర్జీలు తీసుకుని కేంద్ర కార్యాలయని వస్తున్నారని తెలిపారు. మదనపల్లె ఘటనే రెవెన్యూ శాఖ నిర్వీర్యానికి ఉదాహరణ అన్నారు. అన్ని వ్యవస్థలను 100 రోజుల్లో గాడిలో పెడతమాన్నారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సమస్యలను విభాగాల వారీగా విభజించి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. వినతులు ఇచ్చేందుకు రాష్ట్ర నలుమూలల నుండి మంగళగిరి కేంద్రకార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా జిల్లాలు, నియోజకవర్గాల్లోనే వినతులు తీసుకునేలా చర్యలు చేపడతామని అర్జీదారులకు సీఎం భరోసా ఇచ్చారు.

• పులివెందులలో తమకు ఐదు ఎకరాల పొలం ఉందని.. దాంట్లో అక్రమంగా మాజీ సీఎం జగన్ రెడ్డి బంధువులు మనోహర్ రెడ్డి, వారి అనుచరులు వాటర్ ట్యాంక్ కట్టారని… పొలం దగ్గరకు వెళితే కొడుతున్నారని.. కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. దయ చేసి తమకు న్యాయం చేయాలని కర్రెద్దుల విజయ నేడు మంగళగిరి ప్రధాన కార్యాలయంలో వినతి అందించారు.

• 2ANM లుగా ఉన్న తమను రెగ్యులర్ చేయాలని… సచివాలయాలు పెట్టి తమను తీసుకోకుండా కొత్త ANMలను తీసుకుని తమకు జగన్ రెడ్డి అన్యాయం చేశాడని తమకు పనికి తగిన జీతం ఇచ్చి రెగ్యులర్ చేయాలని వారు కోరారు.

• 100 కోట్ల విలువైన 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు యత్నిస్తున్నారని… కబ్జా నుండి ప్రభుత్వ స్థలాన్ని విడిపించాలని దానిపై మున్సిపల్ కమిషనర్ కు గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. తిరుపతి మున్సిపాలిటీకి చెందిన శ్రీ సాయి విష్ణు లే అవుట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.

• తనపై వైసీపీ నేతలు కక్ష గట్టి కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న భూమికి పట్టా పొందకుండా… రోడ్డు నిర్మాణంలో కోల్పోయిన భూమికి నష్టపరిహారం రాకుండా అడ్డుకుంటున్నారని కొయ్యూరు మండలానికి చెందిన చితుకులయ్య వాపోయాడు

• కుండలు అమ్ముకుని బతుకుతున్న కుమ్మరి కులస్థులమైన తమ భూమిని వైసీపీ నేత వేమూరి ఆదాం ఆక్రమించుకున్నాడని… అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు బానాయించి వేధించాడని.. .పోలీసు స్టేషన్ ల చుట్టూ తిప్పాడని. తమను అక్రమ కేసుల నుండి విడిపించి.. తమ భూమిని ఆక్రమన నుండి విడిపించాలని ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం అల్లూరు గ్రామ శాలివాహన కులస్తులు గ్రీవెన్స్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ముందు వాపోయారు.

• గుంటూరు జిల్లా గుంటూరుకు చెందిన బడిగినేని పద్మావతి కన్నీటిపర్యంతం అవుతూ… తన కుమారుడి చావుకు కారణమైనా సాయి రోహిణిపై చర్యలు తీసుకోవాలని… కట్నం లేకుండా తన కొడుక్కి పెళ్లి చేసుకుంటే… అక్రమ సంబంధం పెట్టుకుని పెళ్లి అయిన రెండో రోజు నుండే తన కొడుకుని వేధిస్తూ… పెళ్లి జరిగి నాలులు నెలలు నిండకుండానే కడపులో పెట్టుకుని పెంచుకున్న కొడుకుని ఆత్మహత్య చేసుకునేలా చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

• డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో గత 16 సంవత్సరాలుగా వైద్య మిత్రలుగా అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నామని కావున వైద్య మిత్రల అనుభవాన్ని పరిగణలోకి తీసుకొన కాంట్రాక్ట్ చేయాలని హెచ్ ఆర్ పాలసీని అమలు చేయాలని వైద్య మిత్రలు పల్లా శ్రీనివాస్ కు వినతి పత్రం అందించారు

• అల్లూరి జిల్లా ఏటపాక మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన కె. మోక్షిత ( 2సంవత్సరాలు) లీవర్ సమస్యతో బాధపడుతుందని… వెంటనే ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులు వాపోగా పాప వైద్యానికి సాయం చేస్తానని పల్లా శ్రీనివాసరావు వారికి హామీ ఇచ్చారు.

• మున్సిపల్ డిపార్ట్ మెంట్ లో వార్డ్ వెల్ఫేర్ &డెవలప్ మెంట్ సెక్రటరీలుగా పనిచేసిన తమను ఉద్యోగాల నుండి తొలగించారని… తమను తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలని కోర్టు ఆదేశించినా కోర్టు ఆదేశాలను పట్టించుకోవడంలేదని.. వెంటనే కోర్టు ఆర్డర్ ను అమలు చేసి తాము కోల్పోయిన జీతాన్ని ఇప్పించాలని కోరారు.

• పిల్లి ఆనంత లక్ష్మి దంపతులు గ్రీవెన్స్ కు వచ్చి తమ నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేట్ పదవులను కల్పించాలని వారి తరఫున విజ్ఞప్తి చేశారు.

వీటితో పాటు పలువురు ఉద్యోగాలకోసం అర్జీలు ఇవ్వగా వైసీపీ హయాంలో తమ పింఛన్ లు తొలగించారంటూ వృద్ధులు వినతిపత్రాలు తీసుకు వచ్చారు. పెద్ద ఎత్తున దివ్యాంగులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరికొందరు నామినేటెడ్ పదవులు ఆశిస్తూ వినతులు ఇచ్చారు

LEAVE A RESPONSE