– కూలీల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. పలు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగివస్తున్న సందర్భంలో పార్కు వద్ద ఆగి పనులను పరిశీలించారు. చెత్తా చెదారంతో నిండి ఉన్న ఈ ప్రభుత్వ స్థలం కబ్జాకు గురికాకుండా.. పార్కు నిర్మాణం చేయాలని గతంలో జీహెచ్ఎంసీని సీఎం ఆదేశించారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో పార్కులో జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. పార్క్ లో పనిచేస్తున్న కూలీలకు ఆప్యాయంగా పలకరించారు. పనులకు సంబంధించిన వివరాలతో పాటు కూలీల సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు.