– 27వేల మంది డీఈడీ అభ్యర్థులతోపాటు, డీఈడీ కళాశాలలపై ఆధారపడి జీవిస్తున్న 13వేలమంది జీవితాలతో ఆడుకునే అధికారం ఈ ముఖ్యమంత్రికి లేదు
• ప్రపంచబ్యాంక్ తో రూ.18వేలకోట్ల అప్పుకోసం ఒప్పందంచేసుకున జగన్మోహన్ రెడ్డి, అందుకుప్రతిఫలంగా రాష్ట్రవిద్యావ్యవస్థనే తాకట్టుపెట్టడానికి సిద్ధమయ్యాడు ఏ.ఎస్.రామకృష్ణ
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు , మాజీఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ
రాష్ట్రఆర్థికపరిస్థితి ఎంత అధ్వాన్నంగా తయారైందో, దానికంటే దారుణంగా రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ తయారైందని, ఎయిడెడ్ విద్యావ్యవస్థ పై పిల్లిమొగ్గలు వేస్తున్న జగన్ ప్రభుత్వం, విద్యాసంస్థల అంగీకారంతోనే వాటినిస్వాధీనంచేసుకుంటున్నామనిచెప్పిన ప్రభుత్వం, వాస్త వంలో దాన్ని అమలుచేయడంలేదని, జిల్లాల్లోని విద్యాశాఖాధికారులు, ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలపై ఇప్పటికీ తమఒత్తిళ్లను కొనసాగిస్తున్నాయని టీడీపీనేత, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మాజీఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణతో కలిసి విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు వారి మాటల్లోనే ..
రాష్ట్రంలో 27వేల మందిఅభ్యర్థులు డైట్ సెట్ పరీక్ష రాస్తే, ఫైనల్ పరీక్షలను ఈ ప్రభుత్వం నిలిపేయడం తో సదరు అభ్యర్థులంతా డోలాయామానంలో పడ్డారు. నూతనవిద్యావిధానంలో డైట్ సెట్ తో, డీఈడీ అభ్యర్థులతో తమకు పనిలేదన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కానీదాన్ని ఉత్తర్వుల రూపంలో ప్రకటించని వైసీపీప్రభుత్వం, డైట్ సెట్ పరీక్షరాసిన 27వేలమంది అభ్యర్థుల జీవితాలుఅగమ్యగోచరంగా మారాయి. ఈ ప్రభుత్వం నూతనవిద్యావిధానం ముసుగులో అనేకమంది జీవితాలతో ఆటలాడుతోంది.
నూతన విద్యా విధానంలో డైట్ సెట్, బీఈడీలు కలిపి ఒకే ఇంటిగ్రేటెడ్ కోర్సుగా రానున్నందున, డైట్ సెట్ అవసరం లేదని, డీఈడీ కాలేజీలతో పనిలేదనే నిర్ణయానికి ఈ ప్రభుత్వం వచ్చింది. అయితే దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వకుండా 2018-19 బ్యాచ్ కు చెందిన డీఈడీ అభ్య ర్థులకు ఇంతవరకు ఈప్రభుత్వం ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించలేదు. అభ్యర్థులభవిష్యత్, కాలేజీల పరిస్థేతేమిటో తెలియన పరిస్థితి. కేంద్రప్రభుత్వం బీఈడీని,డీఈడీని కలిపి ఒకే ఇంటి గ్రేటెడ్ కోర్సుగా అమలు చేయాలనుకుంటున్నామని, దానికి సంబధించిన విధివిధానాలను రాష్ట్రాలే తయారుచేసుకోవాలని, ఆప్రక్రియను 2030 నుంచి అమలుచేసేయోచనలోఉన్నామ ని చెప్పడం జరిగింది.
కానీ ఏపీ ప్రభుత్వం కేంద్రప్రకటనను సాకుగాచూపుతూ, ఇప్పుడే (2021లోనే) డీఈడీ పరీక్షలు నిలిపేయడం దురదృష్టకరం. ఈ సమస్య పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి దానిపైఎలాంటి నిర్ణయం తీసుకోకుండా 27వేలమంది అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటన్నారు. గతంలో ఆడపిల్లలుఎక్కువగా టీచర్ ట్రైనింగ్ కోర్సువైపు మొగ్గుచూపితే, మగపిల్లలు ఐటీఐ చదివి ఇండస్ట్రియల్ సెక్టార్ వైపు వెళ్లేవారు. స్థానికంగా ఉపాధికల్పించే అలాంటి కోర్సులను ఈప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టేసింది. వ్యవస్థలు మారినప్పుడు వచ్చే ఇబ్బందులను అధిగమించాల్సిన ప్రభుత్వం, 617 డీఎడ్ కాలేజీలను గాలికి వదిలేయడం దురదృష్టకరం.
గతంలో ఇంగ్లీష్ మీడియం అమలువిషయంలో ఏమాత్రంఆలోచనలేకుండా వ్యవహరించి బొక్కబోర్లాపడి, కోర్టులచేతిలో చీవాట్లుతిన్న ప్రభుత్వం, ఇప్పుడు డీఎడ్ కాలేజీల విషయంలో కూడా ముందుచూపు లేకుండా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోఉన్న 617 డీఎడ్ కాలేజీల్లో నాన్ టీచింగ్, టీచింగ్ స్టాఫ్ దాదాపు 13వేలవరకు ఉద్యోగులుఉన్నారు. వారందరి జీవితాలను ఈప్రభుత్వం ఏంచేయాలనుకుంటోంది? వారితోపాటు పరీక్షలురాసిన 27వేలమంది అభ్యర్థులజీవితాలనుకూడా రోడ్డునపడేయాలన్నదే జగన్ ప్రభుత్వ ఉద్దేశమా? విద్యార్థుల భవిష్యత్ తో, విద్యాసంస్థలతో ఆడుకునే నిర్ణయాలకే ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మద్ధతుఇవ్వడం ముమ్మాటికీ క్షమించరాని నేరం.
రాష్ట్రంలోని విద్యావ్యవస్థను ఈ విధంగా నాశనంచేస్తున్న ముఖ్యమంత్రినిఇప్పుడే చూస్తున్నాం. ముఖ్యమంత్రి డీఎడ్ కోర్సుపై ఒక నిర్ణయానికి రాకుండా, ఎప్పుడు ఆకోర్సుని మూసేస్తారో చెప్పుకుండా డీఎడ్ కళాశాలలు, విద్యార్థులు, కళాశాలలపై ఆధారపడి జీవిస్తున్న 13వేలమంది జీవితాలతో ఆడుకోవడం
భావ్యం కాదని సూచిస్తున్నాం. ఇంతజరుగుతున్నా విద్యాశాఖ మంత్రి దేనిపైనా స్పందిం చడు. మొన్నటికి మొన్న ఎడ్యుకేషన్ పాలసీపై ఒకపేపర్ ఇచ్చామన్న మంత్రి, సంక్షేమపథ కాలను ఏకరువు పెట్టాడు.
విద్యావిధానంలో, సంక్షేమపథకాలకు వ్యత్యాసం తెలియని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం, రాష్ట్రప్రజల దురదృష్టమనే చెప్పాలి. డీఎడ్ కళాశాలలు, కోర్సు పై ముఖ్యమంత్రి తక్షణమే ఒకనిర్ణయానికి రావాలని టీడీపీతరుపున డిమాండ్ చేస్తున్నాం. ఎటూతేల్చకుండా తానుఅనుకున్నది, తనకుతోచింది చేయాలని ముఖ్యమంత్రి భావిస్తే, వ్యవస్థలతోపాటు, వేలాదిమంది జీవితాలు నాశనంకావడం ఖాయమని హెచ్చరిస్తున్నాం.
ప్రాథమిక పాఠశాలలను హైస్కూల్స్ లో విలీనంచేయాలన్న ప్రభుత్వనిర్ణయం విద్యావ్యవస్థకే తూట్లు పొడవనుంది : ఏ.ఎస్.రామకృష్ణ (మాజీఎమ్మెల్సీ)
టీడీపీ హాయాంలో విద్యానాణ్యతాప్రమాణాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే 2వస్థానంలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకివచ్చాక, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఈప్రభుత్వ విధానాలతో 19వస్థానానికి పడిపోయింది. 10, 15, 20 మంది విద్యార్థులుండే ప్రాథమిక పాఠశాలల్లో నలుగురు, 5గురు ఉపాధ్యాయులు ఉండటం వయబుల్ కాదని భావించిన టీడీ పీ ప్రభుత్వం, విద్యార్థులసంఖ్య తక్కువగా ఉన్నప్రాథమిక పాఠశాలలను, విద్యార్థులు అధికం గా ఉండేపాఠశాలల్లో విలీనంచేయాలని చూస్తే, (రేషనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తే) దానిపై ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ, రాష్ట్రంలోని 4వేలస్కూళ్లను మూసేస్తున్నారంటూ, నానాయాగీచేసి కాకి గోలచేసింది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న అదేవైసీపీ, ప్రపంచ బ్యాంక్ తో ఒప్పందంచేసుకొని మరీ విద్యావ్యవస్థలో తిరోగామి సంస్కరణల అమలుకు సిద్ధ మైంది. ఈప్రభుత్వ సంస్కరణల ఫలితంగానే రాష్ట్రవ్యాప్తంగా 14వేల మంది ఉపాధ్యాయులు ఇప్పటికే ఆందోళనబాటపట్టారు. రూ.3లక్షలకోట్ల అప్పులుచేసిన ఈప్రభుత్వం, మరిన్ని అప్పులకోసం చుక్కానీ పట్టుకొని వెతుకుతోంది. దానిలోభాగంగానే ఉపాధ్యాయుల భవిష్యత్ ను పణంగాపెట్టిమరీ, ఈ ప్రభుత్వం ప్రపంచబ్యాంక్ తో రూ.18వేలకోట్ల అప్పుకోసం ఒప్పందంచేసుకొంది. ఆ ఒప్పందం ఏమిటయ్యా అంటే భవిష్యత్ లో డీఎస్సీలు నిర్వహించబో మని, టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వమని, జీతాలుపెంచబోమనే నిబంధనలు అమలుచేయడం. ఆవిధమైన నిబంధనలకు తలొగ్గిమరీ జగన్ ప్రభుత్వం, రూ.18వేలకోట్ల కోసం ప్రపంచబ్యాంక్ తో ఒప్పందం చేసుకొని ఉపాధ్యాయల జీవితాలను కూడా తాకట్టుపెట్టేసింది.
విద్యవిషయంలో జగన్ ప్రభుత్వ నిర్వాకాలతో ఇప్పటికే ప్రజలతోపాటు, మేథావులు, విద్యా రంగ నిపుణులు నవ్వుకుంటన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావ్యవస్థకు నష్టం జరుగతోందని తమిళనాడు ప్రభుత్వం నిర్ద్వందంగా తిరస్కరించిన న్యూఎడ్యకేషనల్ పాలసీ, (స్కూల్ మ్యాపింగ్) ని ఏపీప్రభుత్వం అమలుచేయడానికి సిద్ధమైంది. అత్యంత బలహీనమై న జగన్ ప్రభుత్వం ప్రపంచబ్యాంక్ కు లొంగిపోయి, విద్యార్థులు, ఉపాధ్యాయుల భవిష్యత్ ను తనస్వార్థానికి పణంగాపెట్టడానికి సిద్ధమైంది. రాష్ట్రంలో దాదాపు 50వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలుంటే, వాటిని మూడువిడతల్లో న్యూఎడ్యుకేషనల్ పాలసీలో భాగంగా హైస్కూల్స్ లో విలీనంచేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే గ్రామాల్లో అరకిలోమీటర్ పరిధిలో ఉంటే 2,600ప్రీప్రైమరీ స్కూళ్లను హైస్కూళ్లలో కలిపేయడం జరిగింది. మూడువిడతల్లో చేస్తామన్న తంతు మొత్తాన్ని తక్షణమే పూర్తిచేయాలంటూ ఈ ప్రభుత్వం ఇప్పటికే విద్యాశాఖకు హుకుంజారీచేసింది.
ప్రభుత్వం చేయాలనుకుంటున్నది ఎంతవరకు సాధ్యమవుతుందో ఆలోచనచేయకపోతేఎలా? 2కిలోమీటర్ల పరిధిలోఉన్న ప్రభుత్వప్రాథమిక పాఠశాలలను, హైస్కూళ్లలో విలీనంచేస్తే, దానివల్ల విద్యాభ్యాసం ఆరంభించిన చిన్నారులు ఎంతతీవ్రంగా నష్టపోతారనేఆలోచన ఈప్రభుత్వం చేయదా? పిల్లలకు నడవగలిగేంత దూరంలో ప్రాథమిక పాఠశాలలు ఉండాలన్న కొఠారియా కమిషన్ నిర్ణయాలను ఈప్రభుత్వం తుంగలో తొక్కడం బాధాకరం. జగన్ ప్రభుత్వనిర్ణయంతో మున్సిపాలిటీల్లోఉన్న 1675ప్రాథమిక పాఠశాలలకు ఇప్పటికే తాళాలుపడే పరిస్థితి నెలకొంది. 1675 ప్రాథమిక పాఠశాలలు పోతే, ఇక మున్సిపాలిటీల్లో మిగిలేది కేవలం 500పాఠశాలలు మాత్రమే. జిల్లాపరిషత్, మండలపరిషత్ ఆధ్వర్యంలోని విద్యావ్యవస్థను కూడా నాశనంచేసేదిశగానే జగన్ ప్రభుత్వం వెళుతోంది. ద్విభాషా విధానం అమలుచేయకుండా, ఒకేభాషకు విద్యను పరిమితంచేయడం ద్వారా, ఇప్పటికే జగన్ ప్రభుత్వం వేలాదిమంది విద్యార్థులను రోడ్డునపడేసింది.
విద్యార్థులను, ఉపాధ్యాయులను, రోడ్డునపడేసేచర్యలకుపాల్పడుతున్న ప్రభుత్వం, మధ్యాహ్నభోజనం తాలూకాబిల్లులనుకూడా నిలిపేసింది. రంగులపేరుతో, మద్యం, ఇసుక అమ్మకాలతో అంతులేని అవినీతికిపాల్పడుతున్న ప్రభుత్వం, చివరకు అభివృద్ధికి పట్టుగొ మ్మ అయిన విద్యావ్యవస్థనాశనానికి పూనుకోవడం బాధాకరం. ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఈ ప్రభుత్వ చిత్తశుధ్దిని తాను ప్రశ్నిస్తున్నా. ఎయిడెడ్ విద్యావిధానానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను చూస్తే, ఈ ప్రభుత్వవైఖరేమిటో పాలకులకే తెలియని పరిస్థితి.
యిడెడ్ వ్యవస్థను బదనాంచేయాలన్న లక్ష్యంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడితే, అధికారులు మరోలా ప్రవర్తిస్తున్నారు. ఒక్క టీచర్ ను కూడా కొత్తగా నియమించకుండా, డీఎస్సీనిర్వహించకుండా, టీచర్ల ప్రమోషన్లు ఎగ్గొట్టడానికి, విద్యార్థులపై బలవంతంగా ఇంగ్లీష్ మీడియం రుద్దడానికి, 3, 4, 5 తరగతులను విలీనంచేయాలన్న నిర్ణయంఅమలుదిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. తద్వారా అంతిమంగా రాష్ట్రంలోని విద్యావ్యవస్థను నాశనంచేయడానికే జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ప్రభుత్వ నిర్ణయా లను మూకుమ్మడిగా ప్రతిఘటించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, విద్యార్థులతోపాటు, విద్యారంగ నిపుణులు,మేథావులు, ప్రజాసంఘాలపై ఉంది. స్కూల్ మ్యాపింగ్ పేరుతో 3, 4, 5 తరగతులకు చెందిన 37వేలప్రాథమిక పాఠశాలలను హైస్కూల్స్ లో విలీనంచేయడం, విద్యావ్యవస్థకు తూట్లుపొడవడమే అవుతుందని స్పష్టంచేస్తున్నాం.