– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
అనంతపురం: మంథా తుపానును రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది.. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆరా తీశారు… రాష్ట్రంలో అపార పంట నష్టం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. అందుకు సంబంధించిన అంచనాల సర్వే కు బృందాలు పని చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అదుకుంటుందని తెలిపారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే..
మత్సకారులను ఆదుకుంటాం.. ప్రధాన మంత్రి మత్స సంపద యోజన కింద అన్ని రకాల సాయం అందేలా చర్యలు ఉంటాయి. బీమా, లోను సౌకర్యం ఈ పథకం లో ఉన్నాయి. ఫసల్ బీమా యోజన పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అమలయ్యే లాగా చర్యలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వం దీనిని సక్రమంగా అమలు చేయక ఇబ్బందులు తలెత్తాయి. నష్టపోయిన వారిని అన్ని విధాలు గా ఆదుకునేందుకు మా పార్టీ తరఫున ఓ నోట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం కి అందిస్తాం. వైసీపీ మొదటి నుంచి వ్యతిరేక విధానాన్ని అమలు చేస్తోంది. గూగుల్ వచ్చినప్పుడు, అంతకు ముందు ఇలానే మాట్లాడారు. మంథా విపత్కర పరిస్థితుల్లోనూ వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
తిరుమల దేవస్థానం ప్రాశస్త్యం తగ్గించే విధంగా గత ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. అక్రమాల పై విచారణ జరుగుతుంది.. అన్ని విషయాల పైన చర్యలు ఉంటాయి. శ్రీవాణి నిధులు, పరకామని నిధులు సహా అనేక విషయాలు పై అనుమానాలు వచ్చాయి. భవిష్యత్తు లో ఇలాంటి వి జరగకుండా చర్యలు ఉండాలి. రాజకీయ జోక్యం తో టీటీడీ పునరావాస కేంద్రం గా మారింది. భవిష్యత్తు లో ఇలాంటివి ఉండకూడదని బీజేపీ ముందుకు వెళుతోంది.