Suryaa.co.in

Andhra Pradesh

ఈవీఎం లను తనిఖీ చేసిన కలెక్టర్ అన్సారియా

ఒంగోలు: జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గురువారం స్థానిక మామిడిపాలెంలోని ఈ.వి.ఎం. గోదాములను సందర్శించారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల తలుపులు తెరిచి వాటిలో భద్రపరిచిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాల పరిస్థితిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, రాజకీయ పార్టీల ప్రతినిధులు కోనేటి వెంకటరావు ( టీ.డీ.పీ), దండు శ్రీనివాసరావు ( బిజెపి), ఎం. రమేష్ (జనసేన), దామరాజు క్రాంతి కుమార్ (వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ) , SK రసూల్ ( కాంగ్రెస్ ), తదితరులు పాల్గొన్నారు. ఇ.వి.ఎం.ల పరిస్థితిపై రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE