Suryaa.co.in

Andhra Pradesh

రండి! దస్తగిరిలవ్వండి!! దర్జాగా తిరగండి!!!

(భోగాది వేంకట రాయుడు )

వైసీపీ అనే ఓ నడమంత్రపు గ్రూప్ లో చేరి, ఐదేళ్లపాటు… రాష్ట్రాన్ని గొడ్డలి తో ముక్కలు ముక్కలు గా నరికేసి, ఖీమా గా కొట్టేసిన “గొడ్డలి పార్టీ ప్రియులు ” ఇప్పుడు… చెట్టుకొకరు, పుట్టకొకరు గా పరారై పోతున్నారు. మారు వేషాలు వేసుకుంటూ, సెల్ ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసేసుకుని, అండర్ గ్రౌండ్ లకు వెళ్లిపోతున్నారు. కొందరైతే,… ” చూడు పిన్నమ్మా…. పాడు పిల్లోళ్ళు…. ” అనుకుంటూ “ఆ టైపు ” వేషాలు వేసుకుని తిరుగుతున్నారని వినికిడి.

ఇన్ని బాధలెందుకు? “ప్రజా సేవకుల” ముసుగులో ఘోరాలు, నేరాలు, అరాచకాలు, రేపులు, మర్డర్లు, ఫోర్జరీ లు, భూకబ్జాలు, దోపిడీలు, దౌర్జన్యాలు చేసిన వారందరూ… “దస్తగిరి”లై పోతే….; హ్యాపీ గా (సిగ్గొదిలేసి అయినా ) జనం లో తిరిగేయ వచ్చు. తమ కోసం ఇప్పుడు వెదుకుతున్న పోలీసు వారే, వారికి రక్షణ గా నిలబడతారు. ఈ అరాచకిష్టుల రేంజి, లెవెల్ ను బట్టి సెక్యూరిటీ కూడా పెరుగుతుంది. అవసరాన్ని బట్టి, పోలీస్ ఎస్కార్ట్ వాహనం కూడా పోలీసు వారు ఏర్పాటు చేస్తారు.
మీడియా కు ఇంటర్వ్యూ లు ఇవ్వవచ్చు. మంచి పబ్లిసిటీ వస్తుంది. కేస్ లు ఉండవు. వీలును బట్టి, వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ అభ్యర్థిగానో, కుదరకపోతే… ఇండిపెండెంట్ గానో పోటీ చేయవచ్చు.

పులివెందుల దస్తగిరిని చూడండి. సాక్షాత్తు వై ఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడైన వై ఎస్ వివేకానంద రెడ్డి ని తానే… గొడ్డలి తో కసకసా నరికేసినట్టు చెప్పాడు. అందుకోసం డబ్బులు తీసుకున్నట్టు చెప్పారు. వివేకా మర్డరర్ల గ్రూప్ లో (వీరికో వాట్సాప్ గ్రూప్ కూడా ఉన్నదేమో తెలియదు ) దస్తగిరి ని నెంబర్ 4 గా సీబీఐ వారు గుర్తించారు.

(మన ఆంధ్ర పోలీసు వారికి పెద్ద వారి మర్డర్లు… గట్రా అంటే భయం. అందుకని, వాటి వైపు చూడరు. అందుకే, కోర్టు వారు… ఆంధ్ర పోలీసుల కష్టాన్ని దృష్టి లో పెట్టుకుని, సీబీఐ వారికి అప్పగించారు. అందుకే వివేకానంద రెడ్డి ది మర్డరు అని మనకు తెలిసింది. లేకపోతే, గుండెపోటే….!)

అయితే, దస్తగిరి మాత్రం “ఉన్నది ఉన్నట్టు సీబీఐ కి పూస గుచ్చినట్టు చెప్పేశాడు.” కదిరి గొడ్డలితో నరికిన చెయ్యి నాదేగానీ, నరికించింది మాత్రం వేరే పరిశుద్ధుడు…. ” అని సీబీఐ వారికి చెప్పేశాడు.
దానితో, ” అప్రూవర్ ” గా మారిపోయాడు.

ఇప్పుడు దస్తగిరిని సీబీఐ వారు, కొత్త అల్లుడి టైపు లో చూసుకుంటున్నారు. భవిష్యత్తులో ఏ ప్రజా ప్రతినిధో అయితే అయిపోవచ్చు. అంత మర్డరూ చేసిన దస్తగిరి….ఇప్పుడు ఆ కేసులో సాక్షి అయిపోయాడు.
ఆయనను, కడప ఎస్ పీ వారు ; కంటికి రెప్పలా చూసుకోవాలి.

అదన్న మాట సంగతి.

అందువల్ల, ఐదేళ్ల పాటు, జనం పాలిట కీచకుల్లాగా…. బకాసురుల్లాగా…. హిడింబి, తాటకి ల్లాగ, కబంధు లాగా, నరకాసురుల్లాగా సామాజిక హింసకు పాల్పడిన వారి కోసం…. పోలీసులు వెదకడం కాదు ; వీరే పోలీసుల వెంట బడాలి.
” ఆ ఆరాచకాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, రేపులు, మర్డర్లు, ఫోర్జెరీ లు, సమస్త ఘోరాలు, నేరాలూ చేసింది మేమే గానీ….; చేయించింది మాత్రం ఆ దుష్ట చతుష్టయం. నెల నెలా కప్పం కూడా కట్టాం. మీకు తెలుసు కదా! మీరూ తిన్నారు కదా! అందుకని మమ్ముల్ని అప్రూవర్లు గా మార్చి, మమ్ముల్ని సాక్షులుగా గుర్తించి…. కాపాడండి. పెళ్ళాలు, బిడ్డలు గలవాళ్ళం. కావాలంటే, ఏ మేష్ట్రీటు ముందు చెప్పమంటే…. ఆ మేష్ట్రీటు ముందు చెబుతాం ” అంటూ
పోలీసులకు స్టేట్మెంటు ఇస్తే ; హ్యాపీ గా ప్రస్తుతానికి ఒడ్డున పడవచ్చు. వరస కుదిరితే, కొత్త ప్రభుత్వానికీ మద్దతుదారులై పోవచ్చు.

లేకపోతే, నిత్యం ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తుంటారు, పోలీసులు తిరుగుతుంటారు, వాళ్ళను తప్పించుకు… తప్పించుకు తిరగాలి. దొరికితే, ఓ రౌండ్ వేసుకుంటారు ; మరి వాళ్ళకూ కడుపు రగిలిపోతుంటుంది కదా ; ఇన్నాళ్ళు.. వెంట్రుక లాగా చూశారని.

అందుకే, దస్తగిరి లై పోతే, ఏ బాదరా బందీ ఉండదు.

ఒక్కొక్కరి దగ్గరా నాలుగైదు గడ్డివాముల సైజు లో మేట వేసిన “డబ్బు వాములు ” ఉన్నాయి. అందువల్ల వారికీ ఏమీకాదు.

ఇంకెందుకు ఆలస్యం!? జై దస్తగిరి అనక!?

LEAVE A RESPONSE