Suryaa.co.in

Andhra Pradesh Telangana

ఎంవోయూలు చేసుకుంటే కంపెనీలు రావు

– నెట్ వర్క్ వల్లనే పరిశ్రమలు వస్తాయి
– ఏపీకి హైదరాబాద్ లేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్షన్

దావోస్ పర్యటన గురించి వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎంవోయూలు చేసుకుంటే కంపెనీలు రావని, నెట్ వర్క్ వల్లనే పరిశ్రమలు వస్తాయని చంద్రబాబు చెప్పారు.

ఏపీలో బీపీసీఎల్ ప్రాజెక్టు, అనకాపల్లిలో మిట్టల్ కంపెనీ పెట్టుబడులు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇలా ఇప్పటి వరకూ పది లక్షల వరకూ పెట్టుబడులు తెచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. అలాగే ఏపీకి హైదరాబాద్ లేదన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైనా చంద్రబాబు స్పందించారు. తాను తెలుగు ప్రజల కోసమే హైదరాబాద్ అభివృద్ధి చేశానని, దాని గురించి ఎవరు ఎలా చెప్పినా పర్లేదన్నారు.

దావోస్ పర్యటన సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాము ఏపీ, మహారాష్ట్రలతో పోటీ పడటం లేదని.. చైనాతో పోటీపడుతున్నామంటూ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏపీకి హైదరాబాద్ లేదంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే శనివారం జరిగిన మీడియా సమావేశంలో, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విలేకర్లు చంద్రబాబును ప్రశ్నించారు. దావోస్ పర్యటన వివరాలు వెల్లడించేందుకు చంద్రబాబు శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది మీడియా ప్రతినిధులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబును ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఏపీకి హైదరాబాద్ లేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు.. తెలుగు ప్రజలు, కమ్యూనిటీ కోసం తాను హైదరబాద్‌ను అభివృద్ధి చేశానని.. దాని గురించి ఎవరు ఎలా చెప్పుకున్నా పర్లేదంటూ అభిప్రాయపడ్డారు.

LEAVE A RESPONSE