Suryaa.co.in

Telangana

‘కాళేశ్వరం’ నిర్వీర్యానికి కాంగ్రెస్ కుట్ర

– మాజీ మంత్రి కొప్పుల ఆరోపణ

హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టు పై తీసుకొచ్చిన అప్పులకు కిస్తీ కట్టకుండా దాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోంని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రైతులు సాగునీటి కోసం పడిన బాధలను చూసి కేసీఆర్‌ ఎంతగానో చలించి పోయారని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోటి ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు.

కాళేశ్వరం అంటే కేసీఆర్‌.. కేసీఆర్‌ అంటే కాళేశ్వరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అభివర్ణించారు.

కాళేశ్వరం భారం ఎప్పుడో తీరిపోయింది… మేగిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయినట్టు కాంగ్రెస్‌ ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.

అవాస్తవాలు ప్రచారం చేయడమే కాకుండా నీటిని ఎత్తిపోయకుండా, రైతులకు నీళ్లు ఇవ్వకుండా సముద్రంలోకి పోయేలా చేసి రైతులను ఏడిపించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్‌ మొదటి నుంచి అడ్డుపడుతుందని అన్నారు.

LEAVE A RESPONSE