– నెట్టేసి, అనుచరుల దాడి
– చోద్యం చూస్తూ ఏసీపీకే సర్దిచెప్పిన తోటి పోలీసులు
హైదరబాద్: విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఏసీపీని రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ దుర్భాషలాడారు. ఇది కాంగ్రెస్ రాజ్యాంగం అంటూ చేతులతో నెట్టేసి ఏసీపీపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు. తోటి పోలీసులు చోద్యం చూస్తూ ఏసీపీకే గొడవ వద్దంటూ సర్దిచెప్పారు. ఎన్టీపీసీలో ప్రజాభిప్రాయ సేకరణ సభకు వెళ్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లోద్దని ట్రాఫిక్ ఏసీపీ జాన్ నర్సింహులు ఆదేశించారు. తన వాహనాన్ని ఆపింది ఎవడంటూ ట్రాఫిక్ ఏసీపీ జాన్ నర్సింహులుని ఎమ్మెల్యే తిట్టారు.