– కాంగ్రెస్ పార్టీ రైతులకు శత్రువుగా మారింది
– రైతు రుణమాఫీ కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశాము
– మంత్రి టి .హరీష్ రావు
రైతుల పట్ల ఉన్న వ్యతిరేకతను మరోసారి చాటుకుంది. రైతుబందు పథకం అనేది కొత్త పథకం కాదు. 75వేల కోట్లను రైతులకు రైతుబంధు ద్వారా అందించింది.గత ప్రభుత్వాలు రైతుల నుంచి పన్ను కట్టించుకుంటే… కేసీఆర్ రైతులకు డబ్బులు పంచారు.కాంగ్రెస్ నాయకులు ఎం చెప్పినా ఓట్లు వేయరు. 69లక్షల రైతులు కేసీఆర్ కు అనుకూలంగా ఉన్నారు.
పెన్షన్లు, కేసీఆర్ కిట్ కూడా అపమంటారేమో అనిపిస్తోంది. రైతుల జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నా.డిపాజిట్లు గల్లంతు చేస్తామని హెచ్చరిస్తున్నాము. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. కర్ణాటక ప్రజలు కొడంగల్, గద్వాల్ లో కరెంట్ విషయంలో ఆందోళన చేశారు. కర్ణాటక లో మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదు.
కేసీఆర్ పాలనలో నాణ్యమైన కరెంట్ ఇస్తూ ఎరువులు కూడా అందిస్తున్నాం. రైతుల పై కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టింది. రైతుబంధు పొందిన 69లక్షల రైతులు కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాతపెడతారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతుబంధు కేసీఆర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు శత్రువుగా మారింది.
రేపు కాంగ్రెస్ పార్టీ వస్టే రైతు బందు రాం రాం… మూడు గంటల కరెంట్ మాత్రమే.11సార్లు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ఒక్క పైసా ఇవ్వలేదు…. మాకు రెండు సార్లు అవకాశం ఇస్తే 11సార్లు రైతు బంద్ ఇచ్చాము. మా అంటే ఒక నెల రోజులు కాంగ్రెస్ కుట్రలతో పథకాలు ఆగినా మళ్ళీ మేము రాగానే ఇస్తాం. రైతు రుణమాఫీ కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశాము