– కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతేనే ఇచ్చిన హామీల అమలు
– సామాజిక మాధ్యమం ఎక్స్ లో కాంగ్రెస్‌పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతేనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది. ప్రభుత్వంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే పూర్తిగా దిగజారిన పార్టీ పరువును కాపాడుకోవడానికి అడ్డగోలు ప్రయత్నాలు చేస్తుంది.
జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆపదమొక్కులు మొక్కుతున్నది. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయడం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను కేబినెట్లోకి తీసుకోవడం, మంత్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో హడావుడిగా తిరగడం వంటివి ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉందనడానికి నిదర్శనమన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన డిపాజిట్‌ను కోల్పోయేలా ప్రజలు చేసినప్పుడు మాత్రమే, 2023లో వారు ఇచ్చిన ఆరు హామీలు, 420 వాగ్దానాలను అమలు చేయడం కాంగ్రెస్ ప్రారంభిస్తుంది. కాంగ్రెస్, దాని నాయకత్వానికి గుణపాఠం చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సరైన వేదిక అన్నారు