-సెస్, సర్ చార్జీ రూపంలో రాష్ట్రాల నుంచి కేంద్రం దోపిడీ
-ఏడేళ్లలో ఆంధ్రరాష్ట్రం రూ.46 వేల కోట్లు నష్టపోయింది
-ద్రవ్యోల్బణం అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం
-రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వంపై వైయస్‌ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
పేద, మధ్య తరగతి ప్రజలపై ధరల భారం తీవ్రంగా ఉందని, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాజ్యసభలో నిత్యావసరాల ధరల పెరుగుదలపై జరిగిన చర్చలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ప్రజల సామాజిక, ఆర్థిక, రక్షణ బాధ్యత కేంద్రానిదేనని గుర్తుచేశారు. బొగ్గు, నూనె ధరలు ఏడేళ్లలో అత్యంత గరిష్టానికి చేరాయన్నారు.<
సెస్, సర్ చార్జీల్లో రాష్ట్రానికి ఎందుకు వాటా ఇవ్వరని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటాలో 41 శాతం వాటా ఇవ్వడం లేదని, రాష్ట్రానికి కేవలం 31 శాతం పన్నుల వాటా మాత్రమే ఇస్తుందని స్పష్టం చేశారు. ఏడేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ.46 వేల కోట్లు నష్టపోయిందని గుర్తుచేశారు. సెస్, సర్ చార్జీ రూపంలో రాష్ట్రాల నుంచి కేంద్రం దోపిడీ చేస్తోందన్నారు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లను పెంచాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో ద్రవ్యోల్బణం ఉందని కేంద్రం సమర్థించుకోవడం సరికాదన్నారు. తిరుమల వెంకన్నకు సైతం పన్నులు వేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు.