తడ, సూళ్లూరుపేట : ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సందర్భంగా మూడవ రోజు సోమవారం కూడా నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం జనసంద్రంగా మారింది, నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం పర్యావరణ సమతుల్యాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా కాపాడదామని, నేలపట్టు పక్షులు అభయారన్యాన్ని అందరూ సందర్శించి ప్రకృతిని ఆస్వాదించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సోమవారం తడ మండలం పరిధిలోని నేలపట్టు పక్షుల అభయారణ్యంను కలెక్టర్ సందర్శించి పలువురు విద్యార్థినీ విద్యార్థులు, పర్యాటకులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలు వారి అనుభూతి అడిగి తెలుసుకున్నారు. పలువురు ఏర్పాట్లపై వారి ఆనందాన్ని వ్యక్త పరిచారు. కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పులికాట్ సరస్సు నందు పెలికాన్ పక్షులు చేపలను ఆహారంగా తీసుకొని వాటి సంతతిని పెంపొందించుకొని తిరిగి వాటి సొంత ప్రాంతానికి వెళ్తాయని తెలిపారు.
ఈ పులికాట్ పర్యావరణం ఒక విలక్షణమైనటువంటి ఎకలాజికల్ సిస్టమ్ కలిగి ఉంటుందని తెలిపారు. ఈ సరస్సు పర్యావరణం సమతుల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని ప్లాస్టిక్ వాడకాన్ని ఈ పరిసర ప్రాంతాల్లో వినియోగించరాదని కోరారు పర్యాటకుల సందర్శనార్థం వారికి గైడ్లను ఏర్పాటు చేయడంతో పాటు తగినంత భద్రతా ఏర్పాటు మౌలిక వసతులు ఏర్పాట్లు కల్పించడం జరిగింది.
ఈ పక్షుల పండుగ మూడవ రోజున కూడా ఇంత అశేష జనసందోహం వచ్చి ప్రకృతిని ఆస్వాదించడం ఎంతో మంచి అనుభూతిని వారికి కల్పిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ బైనాక్యులర్ తో పక్షులని వీక్షించారు. అంతకుమునుపు సూళ్ళూరుపేట ఎంఎల్ఏ నెలవల విజయశ్రీ నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని సందర్శించి పర్యాటకులతో మాట్లాడారు.
నేలపట్టు పక్షుల పండుగకు స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పర్యావరణ విజ్ఞాన కేంద్రం నందు పాల్గొని అక్కడకు వచ్చినటువంటి సందర్శకులతో మాట్లాడుతూ ఇలాంటి ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాటు చేయడం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం గత నాలుగు సంవత్సరాలుగా చేయలేకపోయారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ రాష్ట్ర పండగల ఘనంగా నిర్వహించాలని సూచించారని తెలిపారు.
అందుకే ఈ సంవత్సరం ఈ పక్షుల పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు ఇక మీదట ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలిపారు ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కి జిల్లా కలెక్టర్ కి అందరికీ ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు.