విజయవాడ: పారా బ్యాడ్మింటన్ లో వీల్ చైర్ విభాగం లో అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన పడాల రూపాదేవి వారధి కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ని కలసి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
శ్రీకాకుళం జిల్లా కు రూపాదేవి మైసూర్ లో శిక్షణ పొందుతోంది.అయితే కుటుంబ భాద్యతలు కూడా రూపాదేవి పైన ఉండడంతో ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరింది. థాయిలాండ్, ఉగాండా లలో జరిగిన వీల్ చైర్ బ్యాడ్మింటన్ పోటీలు లో పాల్గొని పతకాలు సాధించినట్లు ఈ సందర్భంగా రూపాదేవి తెలిపింది.
ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ బలహీనత ను బలంగా మార్చుకుని బంగారు పతకాలు సాధించగలిగావు అంటే నేటి యువత కు నీవే ఆదర్శ మని అధైర్యపడవద్దు అని పురంధేశ్వరి ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, ఉప్పలపాటి శ్రీ నివాస్ రాజు, బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు