Suryaa.co.in

Telangana

నష్ట నివారణకు చర్యలు

-ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెగిపోయిన చెరువు కట్ట ప్రాంతాన్ని పరిశీలించిన ఉపముఖ్యమంత్రి మట్టి విక్రమార్క

మధిర: చెరువు కట్ట తెగిపోవడంతో మునిగిపోయిన పంట పొలాలను, జరిగిన నష్టాన్ని ఉపముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి మట్టి విక్రమార్క. కి గ్రామ ప్రజలు వివరించారు.

చెరువు కట్ట తెగిపోవడంతో బాణాపురం – వల్లభి గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టారు.

భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని ఇప్పటికే అంచనాలు వేయాలని అధికారులు ఆదేశించిన విషయాన్ని మరోసారి ప్రజలకు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వివరించారు.

జరిగిన నష్టంపై అధికారులు నివేదికలు పంపగానే ప్రభుత్వం నష్ట నివారణకు చర్యలు చేపడుతుందని ఉపముఖ్యమంత్రి ప్రజలకు భరిసా కల్పించారు.

LEAVE A RESPONSE